గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) - టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని క్రిష్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు అతనికి బాలకృష్ణ మరో అవకాశం ఇచ్చారని టాలీవుడ్ ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. అది కూడా క్రిష్ చేతిలో ఒక క్రేజీ సీక్వెల్ పెట్టారట. 

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ!బాలకృష్ణను ఇటీవల క్రిష్ కలిశారని తెలిసింది.‌ ఇద్దరి మధ్య మరో సినిమా చేసే విషయమై చర్చలు జరిగాయి. కొన్నాళ్ల నుంచి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని వినబడుతోంది. ఇప్పుడు ఆ సినిమా కన్ఫర్మ్ అయ్యిందట. శాతకర్ణిలో బాలకృష్ణను క్రిష్ అద్భుతంగా చూపించారు. పైగా, ఆ సినిమా మంచి విజయం సాధించింది. రచయితగా, దర్శకుడిగా క్రిష్ అంటే బాలకృష్ణకు మంచి గురి. అందుకనే మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట.

ఇప్పుడు క్రిష్ చేతికి 'ఆదిత్య 999'?కథకుడిగా, దర్శకుడిగా క్రిష్ శైలి బాలయ్యకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమాలో క్రిష్ తీసిన పార్ట్ బావుందని పేరు వచ్చింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తీయడంలో రాజమౌళి తర్వాత క్రిష్ పేరు వినబడుతుంది. అందుకని తన డ్రీమ్ ప్రాజెక్ట్స్‌లలో ఒకటైన ఆదిత్య 999 (ఆదిత్య 369 సీక్వెల్)ను క్రిష్ చేతిలో పెట్టాలని బాలకృష్ణ డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ వర్గాల కథనం. 

'ఆదిత్య 369'కు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని ఉందని తన మనసులో మాటను బాలకృష్ణ చాలా రోజుల క్రితమే బయట పెట్టారు. అంతే కాదు... ఆ చిత్రానికి డైరెక్షన్ చేస్తానని కూడా అనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ రెడీ అవుతోందని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కథను క్రిష్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది.

Also Readతెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!

'ఆదిత్య 999' సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సన్నిహితులు రాజీవ్ రెడ్డి నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పాటు బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని కూడా నిర్మాణంలో భాగస్వామి అయ్యే అవకాశం ఉంది.‌ మరో బ్యానర్ కూడా జాయిన్ కావచ్చు. 

Balakrishna Upcoming Movies: ప్రస్తుతం బాలకృష్ణ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.‌ ఒకటి తనకు 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి మూడు భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న 'అఖండ' సీక్వెల్ 'అఖండ తాండవం' ఒకటి. 'వీర సింహా రెడ్డి' వంటి విజయవంతమైన సినిమా తీసిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి మరో అవకాశం ఇచ్చారు బాలకృష్ణ. 'అఖండ' పూర్తి అయ్యాక ఆ సినిమా మొదలవుతుంది. దానితో పాటే 'ఆదిత్య 999' చేసే అవకాశం ఉంది. మలయాళ, తమిళ దర్శకులు సైతం ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి విషయానికి వస్తే... అనుష్క ప్రధాన పాత్రలో దర్శకత్వం వహించిన 'ఘాటీ' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. ఆ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Also Readదమ్ముంటే తిరిగి కొట్టండి... నెగిటివ్ రివ్యూలు, బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై అభిమానులకు పవన్ కళ్యాణ్