Music Director Thaman Shares Interesting Update On Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో హై యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2'. ఇప్పటికే రిలీజ్ అయిన బాలయ్య లుక్స్, టీజర్ వేరే లెవల్. సగటు బాలయ్య అభిమానికి టీజర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తోంది. ఇక మ్యూజిక్ లెజెండ్ తమన్ బీజీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కానుండగా ప్రస్తుతం మ్యూజిక్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Continues below advertisement

'తాండవం' స్కోర్ బిగిన్స్

''అఖండ' తాండవం స్కోర్ బిగిన్స్' అంటూ తమన్ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. రీ రికార్డింగ్ పనులు సైతం మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను సైతం షేర్ చేయగా వైరల్ అవుతోంది. 'బాలయ్యను చూస్తే ఎక్కడా లేని జోష్ వస్తుంది. న్యూ డ్రమ్స్ పగలగొట్టేలా వాయించాలి అనిపిస్తుంది.' ఇదీ ఓ ఈవెంట్‌లో తమన్ బాలయ్య గురించి చెప్పిన మాట. నిజానికి 'అఖండ 2' టీజర్ వచ్చినప్పటి నుంచీ బీజీఎంపైనే అందరి దృష్టి ఉంది.

Continues below advertisement

శివుని ఢమరుకం... రుద్ర తాండవం

బాలయ్య మాస్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు 'రుద్ర తాండవం' అనేలా తమన్ మ్యూజిక్ ఉండనున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో ఓ సిగ్నేచర్ షాట్‌లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీకి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటు మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య మాస్ యాక్షన్ ఓ వైపు... తమన్ మ్యూజిక్ మ్యాజిక్ మరో వైపు కలిపి బిగ్గెస్ట్ హిట్ కన్ఫర్మ్ అంటూ చెబుతున్నారు.

Also Read: హాలీవుడ్ టెక్నీషియన్లకు సవాల్... అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే అట్లీ మాటలు

రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్

బాలయ్య బోయపాటి కాంబోలో ఇది నాలుగో సినిమా. 2021లో వచ్చిన 'అఖండ' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా 'అఖండ 2' తెరకెక్కుతోంది. అంతకు ముందు వచ్చిన సింహా, లెజెండ్ కూడా బిగ్ సక్సెస్ అందుకున్నాయి. హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత మూవీ కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్‌కు ముందే దాదాపు రూ.300 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్ వినిపిస్తోంది. బాలయ్య కెరీర్‌లోనే ఇది హైలైట్ అని తెలుస్తోంది.

'అఖండ 2' ఓటీటీ డీల్ రూ.85 కోట్లు పలికినట్లు సమాచారం. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. శాటిలైట్ హక్కులు రూ.60 కోట్లు, నైజాం రైట్స్ రూ.36 కోట్లు, ఆంధ్రా రూ.55 కోట్లు, సీడెడ్ రూ.24 కోట్లు, నార్త్ అమెరికా ఓవర్సీస్ రైట్స్ కలిపి రూ.31 కోట్లు, వీటికి ఆడియో రైట్స్ అదనంగా బిగ్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. హర్షాలి మెహతా కీలక పాత్ర పోషించారు. బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట మూవీని నిర్మిస్తున్నారు.