పాన్ ఇండియా బ్లాక్ బస్టర్, నటుడిగా తనకు నేషనల్ అవార్డు తీసుకు వచ్చిన 'పుష్ప' ఫ్రాంచైజీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎటువంటి రోల్ చేస్తాడు? అని ఆడియన్స్ అందరూ వెయిట్ చేశారు. అనూహ్యంగా తమిళ దర్శకుడు అట్లీతో సినిమా స్టార్ట్ చేశారు అల్లు అర్జున్. ఏకంగా లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడ వీఎఫ్ఎక్స్ కంపెనీలతో, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులతో మాట్లాడారు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేసినట్టు అందరికీ అర్థమైంది. ఇప్పుడీ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఎలా ఉండబోతుంది? అనే అభిమానుల ఆలోచనలకు దర్శకుడు అట్లీ మాటలు ఫుల్ కిక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. 

Continues below advertisement

హాలీవుడ్ టెక్నీషియన్లకు సవాల్!'పుష్ప' తర్వాత అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్, సినిమా గురించి నేషనల్ మీడియా ముందు దర్శకుడు అట్లీ కుమార్ మాట్లాడుతూ... ''కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీకు మేం ఓ కొత్త ప్రపంచం చూపించడానికి వర్క్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూడనిది మాత్రం చూపిస్తానని భరోసా ఇవ్వగలను. చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్లతో మేం వర్క్ చేస్తున్నాం. వాళ్ళు సైతం తమకు ఈ సినిమా ఛాలెంజింగ్‌గా ఉందని చెబుతున్నారు. అంటే మేం ఓ భారీ సినిమా చేస్తున్నామని అర్థం'' అని అన్నారు.

Also Read: చిరంజీవితో అటువంటి హాలీవుడ్ సినిమా చేయాలని... మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కోరిక

Continues below advertisement

సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇండియన్ ఆడియన్స్ అందరికీ ఈ మూవీ స్కేల్ గురించి అర్థం అయ్యింది. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఓ కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. మరి సినిమా ఎలా ఉంటుందో?

అల్లు అర్జున్, అట్లీ సినిమాలో దీపికా పదుకోన్ నటిస్తున్న విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే ఇతర హీరోయిన్స్ వివరాలను ఇంకా చెప్పలేదు. ఈ మూవీలో రష్మిక విలన్ టైపు రోల్ చేస్తున్నారని టాక్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ చేస్తున్నారు.

Also Readకాంట్రవర్షియల్ క్వశ్చన్‌పై ఫీమేల్ జర్నలిస్ట్‌కు కిరణ్ అబ్బవరం క్లాస్‌... తప్పు, మంచిది కాదు!