తెలుగు తెర దేవుడు అంటే ప్రేక్షకులు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన జీవితం ఆధారంగా తనయుడు నందమూరి బాలకృష్ణ రెండు సినిమాలు చేశారు. 'ఎన్టీఆర్: కథానాయకుడు', 'ఎన్టీఆర్: మహానాయకుడు'గా ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.‌ ఓ‌ తరం ప్రేక్షకులను అలరించిన కథానాయిక సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' బయోపిక్ వచ్చింది.‌ మరి మాస్ మహారాజా 

Continues below advertisement

రవితేజ జీవితాన్ని తెరపైకి తీసుకు వస్తారా?రవితేజ బయోపిక్...‌‌ సిద్దు ఇంట్రెస్ట్! మాస్ మహారాజా రవితేజ జీవితం ఆధారంగా బయోపిక్ చేయాలని ఉందని స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన మనసులో కోరికను బయట పెట్టారు. అది కూడా రవితేజ ముందు! 

సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన 'తెలుసు కదా' సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రవితేజ నటించిన తాజా సినిమా 'మాస్ జాతర' అక్టోబర్ 31 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోలు కలిసి సరదాగా సినిమా విశేషాలు ఇతరత్రా కబుర్లు చెప్పుకున్నారు. ఆ సమయంలో బయోపిక్ ప్రస్తావన వచ్చింది.

Continues below advertisement

Also Readచిరంజీవితో అటువంటి హాలీవుడ్ సినిమా చేయాలని... మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కోరిక

''కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమా చేసిన తర్వాత ‌ మీ బయోపిక్ చేయాలని రెండు నెలలు ట్రై చేశా. కానీ కుదరలేదు'' అని సిద్ధు జొన్నలగడ్డ చెప్పారు. అంతే కాదు 'మీరు ఓపెన్ అయితే భవిష్యత్తులో చేస్తాను' అని తన ఆశని వ్యక్తం చేశారు. ''బేసిక్ గా బయోపిక్ అంటే అన్ని పాజిటివ్ విషయాలు చెప్తారు. అలా కాకుండా నెగటివ్స్ కూడా ఉండాలి'' అని రవితేజ అన్నారు. ''మీరు కూర్చుని మనసులో ఉన్న మాటలు చెబితే మేము ట్రై చేస్తాం'' అని సిద్దు జొన్నలగడ్డ చెప్పగా... ''చూద్దాం! ఏమవుతుందో? నేను కూడా ఒకరి బయోపిక్ చేయాలని అనుకున్నాను. కానీ అతను ఎవరు అనేది ఇప్పుడు చెప్పను'' అని రవితేజ వివరించారు. అయితే 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్' సినిమా చేయమని సిద్ధూకు సూచించారు రవితేజ.

రవితేజ సిద్ధు జొన్నలగడ్డ మధ్య సంభాషణలలో 'జాక్' ఫ్లాప్ గురించి కూడా వచ్చింది. ఆ సమయంలో సినిమా పరాజయం పాలైతే ఆ బాధ్యత తాను తీసుకుంటానని రవితేజ చెప్పారు. హిట్ అయితే అందరిదీ అన్నారు. తనకు భయం లేదన్నారు. అయితే 'జాక్' చేసే సమయంలో ఐడియా బాగున్నప్పటికీ షూటింగ్ సమయంలో మనసులో ఎక్కడో చిన్నపాటి భయం మొదలైందని సిద్దు అన్నారు.

Also Readకాంట్రవర్షియల్ క్వశ్చన్‌పై ఫీమేల్ జర్నలిస్ట్‌కు కిరణ్ అబ్బవరం క్లాస్‌... తప్పు, మంచిది కాదు!