NBK109 Movie Second Video Glimpse: నందమూరి అభిమానులు... గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ భక్తులకు ఓ గుడ్ న్యూస్. ఆయన హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఓ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. హీరోగా బాలకృష్ణకు అది 109వ సినిమా. NBK109 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే కదా! అందుకని, ఆ మూవీ టీమ్ ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్ విడుదల చేయడానికి రెడీ అయ్యింది. ఆ రిలీజుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. 


సోమవారం ఉదయం 11.27 గంటలకు!
NBK109 Latest Video Glimpse: జూన్ 10న... అనగా సోమవారం ఉదయం 11.27 గంటలకు ఎన్.బి.కె 109 మూవీ వీడియో గ్లింప్స్ విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థలు అనౌన్స్ చేశాయి. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ వీడియో గ్లింప్స్ అభిమానులకు, ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. రెండో వీడియో గ్లింప్స్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


బాలకృష్ణ వీరాభిమానులు ఆయనను ఎటువంటి పవర్ ఫుల్ రోల్ లో చూడాలని కోరుకుంటారో... దర్శకుడు బాబీ ఆ విధంగా హీరో క్యారెక్టర్ డిజైన్ చేశారని, ఈ సినిమా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 


Also Read: అమలా పాల్ డెలివరీకి అంతా రెడీ... బంప్ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్, వాళ్లకు ఆమాత్రం తెలియదా?






పూనకాలు వచ్చేస్తాయి - అంచనాలు పెంచిన నాగవంశీ 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్.బి.కె 109 సెకండ్ వీడియో గ్లింప్స్ గురించి నిర్మాతలలో ఒకరైన సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ''జూన్ 10వ తారీఖున ఇంకో వీడియో గ్లింప్స్ ప్లాన్ చేస్తున్నాం. (అభిమానులకు) పూనకాలు వచ్చేస్తాయి'' అని సూర్యదేవర నాగవంశీ చెప్పారు. అంచనాలు పెంచేశారు.


Also Readలవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ 2.ఓ... సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?



NBK109 Movie Cast And Crew: బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో, 'యానిమల్' సినిమాలో విలనిజంతో ఎంతో మంది హృదయాలు కొల్లగొట్టిన బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో కూడా ఆయనది విలన్ రోల్ అని టాక్. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణతో ఆయన సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్, డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ 'భగవంత్ కేసరి' సహా వాళ్ల కలయికలో పలు హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాకు 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ, నిరంజన్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.