గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పుట్టినరోజు మరెంతో దూరంలో లేదు. జూన్ 10న బాలయ్య బర్త్ డే (Balakrishna Birthday). ఆ రోజు అభిమానులకు ఓ కనుక కూడా రెడీ అయ్యింది. ఆయన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. 


జూన్ 10న బాలయ్య సినిమా టైటిల్!
బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా (NBK 108 Movie) రూపొందుతోంది కదా! ఆ సినిమా టైటిల్ జూన్ 10న వెల్లడించనున్నారు. గతంలో ఈ సినిమా 'బ్రో - ఐ డోంట్ కేర్' టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే... అందులో నిజం లేదు. బాలకృష్ణ ఇమేజ్, అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు కథకు తగ్గట్టు పవర్ ఫుల్ టైటిల్ డిసైడ్ చేశారట. అది ఏమిటన్నది త్వరలో చెబుతారు.


Also Read : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!



బాలయ్యకు విలన్... అర్జున్ రాంపాల్!
బాలకృష్ణ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు ''జాతీయ పురస్కార గ్రహీత, ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అర్జున్ రాంపాల్ గారికి వెల్కమ్! తెలుగులో ఆయనకు తొలి చిత్రమిది'' అని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ సినిమా పేర్కొంది. ఆల్రెడీ ఆయన షూటింగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. 


బాలయ్య డైలాగ్ అర్జున్ రాంపాల్ చెబితే?
'ఫ్లూట్ జింక ముందు ఊదు! సింహం ముందు కాదు' - నట సింహం చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్! ఇప్పుడు దీనిని అర్జున్ రాంపాల్ చెప్పారు. అంతే కాదు, అనిల్ రావిపూడి సినిమాలో మంచి మంచి డైలాగులు ఉన్నాయని ఆయన వివరించారు. సినిమాలో అవకాశం ఇచ్చినందుకు బాలయ్య బాబు థాంక్స్ అంటూ నమస్కారం పెట్టారు. ఇప్పుడు బాలకృష్ణ, అర్జున్ రాంపాల్ మీద సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. 


రూ. 36 కోట్లకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్.బి.కె 108 (NBK 108 Movie) సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఆరు నెలల ముందు సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్మేశారని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 36 కోట్లకు ఆల్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకుందట.


బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు!
Sreeleela Balakrishna Relation In NBK 108 : ఎన్.బి.కె 108లో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె బాలకృష్ణ కుమార్తె పాత్ర చేస్తున్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదు. శ్రీలీలకు బాబాయ్ పాత్రలో బాలయ్య నటిస్తున్నారు. మరి, శ్రీలీల తండ్రి పాత్రలో ఎవరు నటిస్తున్నారు? అంటే... శరత్ కుమార్! ఈ సినిమాలో బాలకృష్ణకు అన్నయ్య పాత్రలో ఆయన నటిస్తున్నారు.


''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.


Also Read 'ఆదిపురుష్' తెలుగు థియేట్రికల్ రైట్స్ రేటు యమా ఘాటు - ఇది భారీ డీల్ రామా!