Balakrishna's Akhanda 2 Sequel Officially Announced : గాడ్ ఆఫ్ మాసెస్ 'అఖండ 2' బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. డివోషనల్ సోషల్ డ్రామాలో 'అఘోర'గా బాలయ్య తాండవంతో పాటు యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అఖండ 3 ఫిక్స్
'అఖండ 2' క్లైమాక్స్‌లో ఫ్యాన్స్‌కు డైరెక్టర్ బోయపాటి శ్రీను బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. 'అఖండ 2' ఫ్రాంచైజీ కంటిన్యూ అవుతుందంటూ కన్ఫర్మ్ చేశారు. దీనికి సీక్వెల్‌గా 'జై అఖండ' అంటూ మూడో పార్ట్ అనౌన్స్ చేశారు. 'అఖండ శంబల వద్దకు వెళ్తాడు. దేశానికి అతని అవసరం మళ్లీ వచ్చినప్పుడు తిరిగి వస్తాడు.' అంటూ రాసుకొచ్చారు. దీంతో 'అఖండ 3' కన్ఫర్మ్ అయ్యింది. అయితే, ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ పూర్తి చేశాడా? లేదా డెవలప్ చేయాల్సి ఉందా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' లవ్ సాంగ్ 'నా అద్దం నువ్వే' - కపుల్స్ మనసు దోచే లిరిక్స్
సూపర్ హిట్ కాంబో
బాలయ్య, బోయపాటి మూవీ అంటేనే సూపర్ క్రేజ్. ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన లెజెండ్, సింహా, అఖండ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు 'అఖండ 2' తో మరో హిట్ కన్ఫర్మ్ అయ్యింది. ఇదే ఫ్రాంచైజీలో 'అఖండ 3' కూడా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మూవీలో సాక్షాత్తూ శివుడే కైలాసం నుంచి నేలకు దిగి వచ్చాడా అనేలా చేతిలో త్రిశూలంతో అధర్మాన్ని చీల్చి చెండాడే అఖండుడిగా బాలయ్య అదరగొట్టారు. సనాతన ధర్మంతో పాటు పుణ్య క్షేత్రాల మహత్య్యాన్ని చాటి చెప్పేలా మూవీని రూపొందించారు బోయపాటి. ఇప్పుడు 'అఖండ 3' కూడా అంతకు మించిన స్థాయిలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసుకొస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అసలేంటీ 'అఖండ' కథ
ఫస్ట్ పార్ట్‌లో మైనింగ్ అక్రమాలు దాని వల్ల పర్యావరణ విధ్వంసం దీనికి మైథలాజికల్ టచ్ ఇస్తూ దైవ శక్తి సాయంతో పర్యావరణాన్ని ఎలా రక్షించారో చూపించారు బోయపాటి. 'అఖండ'లో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ రోల్ చేశారు. అఘోర 'అఖండ' తాండవానికి బాలయ్య ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఇక రెండో పార్ట్ స్టోరీ విషయానికొస్తే... బయో వార్ ప్రధానాంశంగా తీసుకుని డివోషనల్ సోషల్ డ్రామాగా రూపొందించారు. టిబెట్ సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన సైనికుల్లో చైనా ఆర్మీ జనరల్ కుమారుడు చనిపోతాడు. దీంతో భారత్‌ను నాశనం చేయాలని శపథం చేసి... భారత ప్రధాని పదవిపై కన్నేసిన పొలిటీషియన్ అజిత్ ఠాకూర్‌తో చేతులు కలుపుతాడు. భారతీయుల నమ్మకాల్ని దెబ్బకొట్టేలా కుంభమేళాను టార్గెట్ చేసి బయోవార్‌కు దిగుతారు.
దీంతో పవిత్ర స్నానం చేసిన భక్తులు నిమిషాల వ్యవధిలోనే వైరస్ బారిన పడి అపస్మారక స్థితికి చేరుకుంటారు. దీనికి విరుగుడుగా డీఆర్డీవో సైంటిస్టులు యాంటీ డాట్ వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఈ విషయం తెలిసి సైంటిస్టులతో పాటు ల్యాబ్‌ను నాశనం చేస్తారు. ఈ బృందంలో యువ సైంటిస్ట్ జనని (హర్షాలి మల్హోత్రా) వ్యాక్సిన్‌తో సేఫ్‌గా బయటపడుతుంది. ఆమెను చంపేందుకు శత్రువులు ప్లాన్ చేయగా వారిని రుద్ర సికిందర్ అఘోర (బాలకృష్ణ) అడ్డుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు జననికి, ఎమ్మెల్యే బాలమురళీ కృష్ణకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఫర్ఫెక్ట్ ఎండ్ ఇస్తూ సీక్వెల్‌కు సైతం బోయపాటి హింట్ ఇచ్చారు.