డే 95 ఎపిసోడ్ లో ఇమ్మూ - సంజనాకు మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు సుమన్, భరణి. "ఫైనలిస్ట్ అవ్వడానికి మీరు చేస్తున్న పోరాటంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రక్రియను చేసే సమయం ఆసన్నమైంది. లీడర్ బోర్డులో అందరి కంటే స్కోర్ తక్కువ ఉన్న కారణంగా సుమన్ పోరు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. తప్పుకునే ముందు మీరు సంపాదించిన స్కోర్, పాయింట్స్ లో సగం ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారో చెప్పండి" అని అడిగారు బిగ్ బాస్. "సుమన్ అన్న మైండ్ పెట్టి ఆలోచిస్తే నిన్న గేమ్ ఆడలేదు కాబట్టి మనిద్దరిలో ఒకరికి ఇవ్వాలి. అతనికి లక్ష ఇచ్చింది నేనే కాబట్టి నాకే ఇస్తే ఇంకా బాగుంటది" అని డెమోన్, "భరణి అన్నకు ఇస్తే ఆయన దొరకడు" అని ఇమ్మాన్యుయేల్ అనుకున్నారు. "నా పాయింట్స్ మీకే ఇస్తాను" అని సుమన్ అంటే.. "నాకంటే లీస్ట్ లో ఉన్న సంజనకు ఇస్తే హెల్ప్ చేసిన వాళ్లము అవుతాము" అన్నాడు భరణి. దీంతో సుమన్ ఒప్పుకోగా, సంజన ఎమోషనల్ అయ్యింది. 50,000 పాయింట్స్, 50 స్కోర్ ను సంజనాకు ఇచ్చేశాడు సుమన్. 

Continues below advertisement

భరణినే అందరి టార్గెట్ 

"ఇంటి సభ్యులు అందరూ కలిసి నేనిచ్చే నెక్స్ట్ టాస్క్ లో పాల్గొనకుండా ఉండడానికి ఓ ఇంటి సభ్యుడిని ఎన్నుకోండి" అని చెప్పారు బిగ్ బాస్. "హయ్యెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళని తీస్తా".అని చెప్పింది తనూజా. "నేను స్ట్రాంగ్ వాళ్ళనే తీయాలి అనుకుంటున్నా. ఇమ్మూకి  150 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ గేమ్ లో 100 వస్తే 250... సింపుల్ లాజిక్. హయ్యెస్ట్ అయినా కాకపోయినా నేనే టార్గెట్ అవుతాను" అని అన్నాడు భరణి. అంతేకాదు "భరణి అన్నకు నీకు పెద్దగా తేడా లేదు. ఆయనకు సపోర్ట్ చెయ్యి అని చెప్పు" అంటూ సుమన్ తో మళ్ళీ సందేశం పంపాడు భరణి. మొత్తానికి హయ్యెస్ట్ ఓటింగ్ తో భరణి తీసేశారు. తరువాత "ఇది జోక్ కాదు డ్యూడ్" అనే టాస్క్ పెట్టారు. ఇందులో సంజనా గెలిచి, పాయింట్స్ బోర్డులో టాప్ లోకి వెళ్ళిపోయింది. ఈ టాస్క్ అయ్యాక 290 సంజన, 270 ఇమ్మూ, భరణి 230, తనూజా 220,  డెమోన్ 150 పాయింట్స్ సంపాదించారు. బిగ్ బాస్ లీడర్ బోర్డులో అందరికంటే తక్కువ స్కోర్ ఉన్న డెమోన్ ఈ పోరు నుంచి తప్పించారు. తాను సంపాదించిన స్కోర్ లో సగం 75,000 పాయింట్స్, స్కోర్ లో సగం తనుజకు ఇచ్చేశాడు డెమోన్. దీంతో 295తో తనూజా టాప్ లోకి వచ్చింది. భరణి 230తో లీస్ట్ లో ఉన్నాడు. 

Continues below advertisement

తనుజాను టార్గెట్ చేసిన ఆడియన్స్ "ఇంటి సభ్యులు అందరూ కలిసి నెక్స్ట్ టాస్క్ లో పాల్గొనకుండా ఒకరిని సెలెక్ట్ చేయాలి. మీరు ఓటు అప్పీల్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం" అని చెప్పారు బిగ్ బాస్. "అందరూ నన్నే టార్గెట్ చేస్తారు" అంటూ వెళ్ళి తనకు సపోర్ట్ చేయమని అందరినీ అడిగాడు భరణి. "ఇమ్మూను తీయాలి అనుకోవట్లేదు" అంటూ తనూజ చేసిన కామెంట్స్ కు భరణి హర్ట్ అయ్యాడు. చివరికి అందరూ భరణిని తీయగా, మిగిలిన వాళ్ళకు బిగ్ బాస్ "బ్యాలెన్స్ అండ్ స్టడీ" అనే టాస్క్ ఇచ్చారు. ఇమ్మూ విన్ అవ్వగా... తనూజా 335, ఇమ్మూ 320, సంజన 320, భరణి 230 పాయింట్స్ స్కోర్ చేశారు. ఇమ్మూ, సంజనాకు టై అవ్వడంతో బిగ్ బాస్ ఆదేశం మేరకు తనూజా సంజనాకు ప్రేక్షకులను ఎదుర్కొనే ఛాన్స్ ఇచ్చింది. కానీ ఆడియన్స్ తనూజకు ఓటు అప్పీల్ ఛాన్స్ ఇచ్చారు. తరువాత ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు తనూజ సమాధానం చెప్పింది. 

Also ReadBigg Boss Telugu 9 Time Change : బిగ్​బాస్ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్, టైమ్ మారిపోతుంది.. తమిళ హిట్ సీరియల్ 'పొదరిల్లు' కోసమే

1. మీరు ఎక్కువగా ఏడుస్తారు. అది ఒక్కోసారి జెన్యూన్ గా అనిపించదు. ఎందుకు?తనూజ : ఇక్కడున్న అందరూ నాకు కొత్త. ఎవరైనా ఏదన్నా అంటే ఎవరికి చెప్పాలో తెలియక ఎమోషనల్ అయ్యేదాన్ని. ముందు వచ్చే ఎమోషనే కదా.

2. భరణితో మీ బాండింగ్ లో నాన్న నుంచి భరణి సార్ అని ఎందుకు మారింది? ఫైర్ స్టార్మ్ వచ్చాకా భయపడ్డారా?తనూజ : మేము ఒకరికి ఒకరు సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు నాన్న అనేది సింపతిగా క్రియేట్ అవుతోంది. డే 1 నుంచి ఇప్పటిదాకా అలాగే ఉంది బాండింగ్. సాప్ట్ కావొద్దని నేను భరణి సార్ అని పిలిచాను.

3. మొన్న ఇమ్మూ ఫ్రెండ్ కాదు. నిన్న ఫ్రెండ్ అన్నారు. ఎందుకు? అతను అంత సపోర్ట్ చేశాడు కదా?తనూజ : నాకు కోపం వచ్చింది. అది చూపించడానికి, వాడు కూడా హర్ట్ కావాలని అన్నాను. మళ్ళీ కలిసిపోయాం. నేను సపోర్ట్ చేయలేదా? 

ప్రేక్షకుడు : 2 వారాల తరువాతనా? మీరు సపోర్ట్ చేయలేదు. మీరే అందరితో సపోర్ట్ చేయించుకున్నారు 

Also Read: Bigg Boss 8 Winner Nikhil: ట్రెండింగ్‌లో 'బిగ్ బాస్ 8' విన్నర్ నిఖిల్ వీడియో సాంగ్... మలయాళ భామతో 'తేనెల వానలా'