Bigg Boss 9 Telugu Sanjana Cried Promo : బిగ్‌బాస్ చూసే ప్రతి ఒక్కరికి సంజన చాలా ఫన్నీగా ఉంటుంది. ఎక్కువ ఎమోషన్స్ బయటకి చూపించదు అని తెలుసు. కానీ ఈసారి సంజన ఫుల్ ఎమోషనల్ అయింది. ఏడ్చేసింది. దీనికి కారణం సుమన్ శెట్టి అయినా.. బాధతో కాదు, ఎవరో ఒకరు తనకి సపోర్ట్ చేశారు అనే ఆనందంతో ఏడ్చేసింది. ఇంట్లో జూనియర్స్ అంతా కలిసి ఆడుతుండగా.. ఇప్పుడు సీనియర్స్ అంతా ఒకటి అయ్యారు. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో ఈసారి ఏడ్పించేసింది. ఇది కదా కావాల్సింది. 95 రోజుల తర్వాత ఇంతటి ఎమోషన్స్‌ని బయటకి తీసుకొచ్చాడు బిగ్‌బాస్. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రక్రియను చేసే సమయం ఆసన్నమైంది అంటూ బిగ్‌బాస్ చెప్పడంతో ప్రోమో స్టార్ట్ అయింది. సుమన్ లీడర్బోర్ట్లో అందరికంటే తక్కువ పాయింట్స్‌తో మీరు ఉన్నారు. కాబట్టి మీ స్కోర్ తక్కువ ఉన్న కారణంగా ఈ పోరు నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో సుమన్ షాక్ అయ్యాడు. అయితే ఈ పోరు నుంచి తప్పుకునే ముందు మీ దగ్గర ఉన్న లక్ష పాయింట్స్‌లో సగం, అమోంట్లో సగం వేరే పోటీదారుడికి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు.
ఎమోషనల్ అయిన సుమన్.. భరణి సలహా అదే
బిగ్‌బాస్ అనౌన్స్‌మెంట్‌తో సుమన్ శెట్టి ఏడ్చేశాడు. భరణిని బయటకు తీసుకెళ్లి.. నా పాయింట్స్, నా స్కోర్ నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. నాకు ఎవరూ లేరు. ఇక్కడ మీరు తప్పించి అంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే అప్పటికే అందరికన్నా హైస్కోర్లో ఉన్న భరణి.. ఆ పాయింట్స్ తనకి కాకుండా ఇంకెవరికి ఇస్తే మంచిది అవుతుందో ఆలోచించమని చెప్తాడు. అప్పుడు సుమన్.. సంజన అంటాడు. అవును అన్నట్లు భరణి చెప్పాడు.
ఏడ్చేసిన సంజన.. ఏడ్పించేశారు కూడా..
సుమన్ సంజనను బయటకి పిలిచి.. పాయింట్స్, డబ్బు మీకే ఇద్దామనుకుంటున్నాను అని చెప్పడంతో సంజన ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. ఏడుస్తూ.. నాకు ఎవరినైనా అడగడానికి మొహమాటం అన్నా అంటూ ఏడ్చేసింది. తర్వాత సుమన్ సంజన గారికి ఇద్దామనుకుంటున్నాను బిగ్‌బాస్ అని చెప్పడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. తర్వాత బిగ్‌బాస్ తదుపరి పోరు గురించి వివరించాడు.
లీడర్ బోర్డ్‌లో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తోన్న యుద్ధం.. ఇది జోక్ కాదు అంటూ చెప్పాడు. ఒకరి తర్వాత ఒకరు స్లైడ్ పై బాల్ పెట్టి.. ఆ చివరికి వచ్చిన తర్వాత జోకర్‌కి తగిలేలా బాల్ని వేయాలి అని చెప్పాడు. అందరికీ ఆరు అవకాశాలు ఉంటాయని చెప్పారు. దీంతో అందరూ గట్టిగానే ట్రై చేశారు. ఈ ప్రోమోలో మాత్రం సంజననే బాగా ఆడినట్లు చూపించారు. మరి గేమ్‌లో ఎవరు గెలిచారో పూర్తి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే.