Balakrishna's Akhanda 2 Release Pushed Back: 'అఖండ'కు సీక్వెల్‌గా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా 'అఖండ 2'. సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఈ సినిమా ఇప్పుడు ఆ తేదీకి రావడం లేదు. 'అఖండ 2' వెనక్కి వెళ్ళింది. విడుదల వాయిదా పడిన విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

'అఖండ 2' వాయిదాకు కారణం ఏమిటంటే?Why Akhanda 2 Release Postponed?: 'అఖండ'కు ముందు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో 'సింహ', 'లెజెండ్' వచ్చాయి. ఆ రెండు చిత్రాలు మాస్ కమర్షియల్ సినిమాను కొత్త కోణంలో చూపించాయి. 'అఖండ' తెలుగు ప్రేక్షకులను దాటి ఉత్తరాది వరకు వెళ్ళింది. హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. అందుకే 'అఖండ 2' అనౌన్స్ చేసినప్పటి నుంచి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ నెలకొంది. అది హీరోతో పాటు దర్శక నిర్మాతలకు తెలుసు. అందుకే, ఆడియన్స్‌కు ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. 

నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' డబ్బింగ్ ఫినిష్ చేశారు. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడం కోసం రీ రికార్డింగ్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. వీఎఫ్ఎక్స్ మీద దృష్టి సారించారు. అవి కంప్లీట్ చేయడానికి మరింత టైమ్ అవసరం అవుతుందని, చిత్ర బృందం క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నారని, సినిమా విడుదలకు టైం కావాలి కనుక వాయిదా వేశామని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పేర్కొంది.

Also Read'ఘాటీ' సెన్సార్ రివ్యూ... అనుష్క సినిమా టాకేంటి? దర్శకుడు క్రిష్ కమ్‌బ్యాక్‌ ఇస్తాడా?

పవన్ కళ్యాణ్ 'ఓజీ'కి లైన్ క్లియర్!పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదల కానుంది. 'అఖండ 2' విడుదల వాయిదా పడటంతో ఆ మూవీకి లైన్ క్లియర్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ బరిలో 'ఓజీ'లో సోలో రిలీజ్ దక్కుతుంది. 

డిసెంబర్ / జనవరి... రిలీజ్ ఎప్పుడు?సెప్టెంబర్ 25న 'అఖండ 2' విడుదల అయ్యే అవకాశం లేదని కొన్ని రోజుల నుంచి ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతోంది. ఇప్పుడు 'అఖండ 2' వెనక్కి వెళ్ళింది. కొన్ని రోజుల క్రితం వరకు డిసెంబర్ తొలి వారంలో లేదా సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని వినిపించాయి. కానీ, జనవరి 9, 2026 - సంక్రాంతికి రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' వెళ్లడంతో డిసెంబర్ ఫస్ట్ వీక్ స్లాట్ ఖాళీ అయ్యింది. సో, జనవరిలో కాకుండా డిసెంబర్ తొలి వారంలో 'అఖండ 2' విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. మరి, చిత్ర బృందం ఎప్పుడు విడుదల చేస్తుందో? ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్. ఆది పినిశెట్టి విలన్.

Also Readసుందరకాండ కలెక్షన్లు... నారా రోహిత్ సినిమా హిట్టే... మరి బాక్సాఫీస్ సంగతేంటి? ఫస్ట్ డే ఎంత వసూళ్ళు వచ్చాయంటే?