The Raja Saab Movie New Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న హారర్ ఫిల్మ్ 'ది రాజా సాబ్'.‌ పాన్ ఇండియా లెవెల్ ఆర్టిస్టులు నటిస్తున్న చిత్రం ఇది. పాన్ ఇండియా రిలీజ్ కోసం రెడీ అవుతోంది. నిజం చెప్పాలంటే... డిసెంబర్ 5న థియేటర్లలోకి రావాల్సిన చిత్రం ఇది.‌ కానీ ఇప్పుడు ఆ తేదీకి విడుదల కావడం లేదు. సంక్రాంతి పండక్కి వాయిదా పడింది. 

జనవరి 9న థియేటర్లలోకి 'ది రాజా సాబ్'ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వం వహిస్తున్న 'ది రాజా సాబ్' సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయాలని తొలుత ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ తేదీకి విడుదల చేయడం లేదని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కన్ఫర్మ్ చేశారు. సినిమా విడుదల వాయిదా పడిందని స్పష్టంగా తెలిపారు. 

జనవరి 9వ‌ తేదీన 'ది రాజా సాబ్' సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నామని ఈ రోజు (ఆగస్టు 28న) 'మిరాయ్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. సో... సంక్రాంతి పండక్కి థియేటర్లలోకి ప్రభాస్ సినిమా వస్తుంది అన్నమాట. సంక్రాంతికి ప్రభాస్ 'ది రాజా సాబ్'తో పాటు మరో రెండు మూడు స్టార్ హీరోల సినిమాలు సైతం థియేటర్లలోకి రానున్నాయి.

'కాంతార 2'తో పాటు రాజా సాబ్ ట్రైలర్!The Raja Saab Trailer Release Date: అక్టోబర్ మొదటి వారంలో 'ది రాజా సాబ్' ట్రైలర్ థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన థియేటర్లలోకి రానున్న రిషబ్ శెట్టి 'కాంతార: ఏ లెజెండ్' (Kantara A Legend) సినిమాతో పాటు ట్రైలర్ అటాచ్ చేయనున్నారు. అలాగే మరొక ట్రైలర్ సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నట్లు నిర్మాత తెలిపారు. సో ప్రభాస్ అభిమానులకు ట్రైలర్ పరంగా డబుల్ ధమాకా అన్నమాట. రెండు ట్రైలర్స్ వస్తాయి అన్నమాట.

Also Read: 'ఘాటీ' సెన్సార్ రివ్యూ... అనుష్క సినిమా టాకేంటి? దర్శకుడు క్రిష్ కమ్‌బ్యాక్‌ ఇస్తాడా?

'ది‌ రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించారు. నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ కాగా... మాళవిక మోహనన్, రిద్ది కమార్ మరో ఇద్దరు హీరోయిన్లు.‌ బాలీవుడ్ స్టార్ యాక్టర్, సీనియర్ హీరో సంజయ్ దత్ ఒక కీలక పాత్ర పోషించారు. సప్తగిరితో పాటు పలువురు హాస్య నటులు సినిమాలో ఉన్నారు. ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయాలని ఉద్దేశంతో ప్రభాస్ ఫస్ట్ టైం ఒక హారర్ జోనర్ సినిమా చేశారు. ఆయన ఇటువంటి సినిమా చేయడం ఇది మొదటిసారి. పండక్కి కుటుంబ ప్రేక్షకులను నవ్విస్తుందని, కచ్చితంగా 'ది రాజా సాబ్' సినిమా హిట్ అవుతుందని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది.

Also Readసుందరకాండ కలెక్షన్లు... నారా రోహిత్ సినిమా హిట్టే... మరి బాక్సాఫీస్ సంగతేంటి? ఫస్ట్ డే ఎంత వసూళ్ళు వచ్చాయంటే?