వినాయక చవితి పండగ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) 'పరదా' సినిమా (Paradha Movie)కు బాగా కలసి వచ్చింది. 'వార్ 2', 'కూలీ' సినిమాలను ప్రేక్షకులు చాలా మంది అప్పటికే చూసి ఉండడం... కొత్త సినిమాల్లో నారా రోహిత్ 'సుందరకాండ' తప్ప మరొకటి లేకపోవడం కూడా 'పరదా'కు ప్లస్ అయ్యింది. దాంతో 'పరదా' రిలీజ్ తర్వాత హైయెస్ట్ డే కలెక్షన్స్ రికార్డు నమోదు చేసింది. ఒక్క రోజే పాతిక లక్షలకు పైగా వసూలు చేసింది.

చవితి రోజు తెలుగులో 'పరదా'కు 34 లక్షలు!'పరదా' సినిమాకు మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర అంత భారీ కలెక్షన్స్ ఏమీ రాలేదు. ఓపెనింగ్ డే... ఆగస్టు 22వ తేదీన 12 లక్షల రూపాయలు వస్తే, ఆ తర్వాత రోజు రూ. 14 లక్షలు వచ్చాయి.‌ ఆ తర్వాత వరుసగా రూ. 13 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 7 లక్షలు కలెక్ట్ చేసింది. వినాయక చవితి రోజైన ఆగస్టు 27వ తేదీ బుధవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో 34 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది.

Also Read: డిసెంబర్‌లో కాదు... సంక్రాంతికి ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్... కన్ఫర్మ్ చేసిన ప్రొడ్యూసర్!

'పరదా' సినిమా విడుదలైన తరువాత పాతిక లక్షల రూపాయల‌ కంటే ఎక్కువ ఒక్క రోజులో కలెక్ట్ చేయడం అనేది గణేష్ చతుర్థి నాడు మాత్రమే జరిగింది. సినిమాకు పండగ బూస్ట్ బాగా కలిసి వచ్చింది.

కలెక్షన్లలో కోటి దాటిన అనుపమ 'పరదా'తెలుగు రాష్ట్రాల్లో బుధవారం వచ్చిన 34 లక్షల రూపాయల వసూళ్లతో 'పరదా' నెట్ కలెక్షన్స్ 90 లక్షల రూపాయలు అయ్యింది. మలయాళంలో విడుదలైన ఆరు రోజుల్లో 16 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చింది. దాంతో సినిమా టోటల్ కలెక్షన్ కోటి దాటింది. ఇండియాలో టోటల్ నెట్ కలెక్షన్ కోటి ఆరు లక్షల కాగా గ్రాస్ కలెక్షన్ కోటి 18 లక్షలు. 

వినాయక చవితి పండగకు సెలవులు ఉండడంతో ఎక్కువ మంది కుటుంబ ప్రేక్షకులు బుధవారం థియేటర్లకు వచ్చారు. చవితి మర్నాడు గురువారం చాలా మందికి వర్కింగ్ డే. సెలవులు లేవు. అందువల్ల ఈ రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికి అయితే సినిమా బడ్జెట్ రికవర్ కాలేదని ట్రేడ్ వర్గాల టాక్.

Also Readసుందరకాండ కలెక్షన్లు... నారా రోహిత్ సినిమా హిట్టే... మరి బాక్సాఫీస్ సంగతేంటి? ఫస్ట్ డే ఎంత వసూళ్ళు వచ్చాయంటే?