Balakrishna Fans Disappointed About Akhanda 2 Postponed : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'అఖండ 2' విడుదల వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. తొలుత కేవలం ప్రీమియర్స్ మాత్రమే క్యాన్సిల్ అయ్యాయని తెలిసిన నిరాశ చెందిన ఫ్యాన్స్ అర్ధరాత్రికి మూవీ కూడా వాయిదా పడిందని తెలిసి జీర్ణించుకోలేకపోతున్నారు.

Continues below advertisement

బాలయ్యకు దిష్టి తీసిన ఫ్యాన్స్

తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ సందర్భంగా సందడి చేద్దామని ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ మూవీ వాయిదా పడడంతో థియేటర్ల వద్ద బాలయ్య పోస్టర్‌కు దిష్టి తీశారు. ఎందుకు ఇలా జరిగిందా? అంటూ ఆశ్చర్యపోతూనే తమ చేష్టలతో అభిమానాన్ని మరింత చాటుకున్నారు. హైదరాబాద్ మధురానగర్ థియేటర్ వద్ద మ్యాన్సన్ హౌస్‌తో బాలయ్య పోస్టర్‌కు అభిషేకం చేసి దిష్టి తీశారు. మరో థియేటర్ వద్ద వీరాభిమాని 'అఖండ 2' అఘోర గెటప్‌లో వచ్చి సందడి చేశాడు.

Continues below advertisement

'అఖండ' గెటప్ వేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సదరు అభిమాని తెలిపాడు. 'శుక్రవారం మూవీ రిలీజ్ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. అది మా దురదృష్టం అని మేము అనుకోవడం లేదు. అదృష్టంగానే భావిస్తున్నాం. ఏది జరిగినా అది మన మంచికే అనుకోవాలి. కాకపోతే అనుకున్న టైంకు సినిమా రిలీజ్ కాకపోవడంతో చాలా బాధగా ఉన్నాం. ఈ బాధ తొలగాలంటే రేపు ఉదయం 9 గంటలలోపు సినిమా పడితే ఈ బాధ తొలగి మేము మళ్లీ ఆనందంగా ఉంటాం.' అంటూ చెప్పాడు. ఈ వీడియోలు, అభిషేకాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ట్రెండింగ్‌లోనే అఖండ 2

మూవీ రిలీజ్ వాయిదా పడినా ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం 'అఖండ 2' ట్రెండింగ్ అవుతూనే ఉంది. టికెట్ బుకింగ్స్ మాత్రం కొనసాగుతున్నాయని కొందరు పోస్టులు పెడుతున్నారు. గంటకు వెయ్యికి పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయని అదీ బాలయ్య క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : అఖండ 2 విడుదల వాయిదా! ఆఖరి నిమిషంలో బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్‌ షాక్

వాయిదాకు అసలు రీజన్స్ ఇవే!

'అఖండ 2' చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్‌కు, ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య పెండింగ్ ఆర్థిక లావాదేవీలే మూవీ రిలీజ్ వాయిదాకు కారణంగా తెలుస్తోంది. మూవీ విడుదలపై మద్రాస్ హైకోర్టు బుధవారం రాత్రి స్టే విధించింది. అయితే, ఇది అవుటాఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయిపోతుందని అందరూ భావించినా అది సాధ్యం కాలేదు. గతంలో ఉన్న సినిమాలకు సంబంధించి పెండింగ్ బకాయిలు రూ.28 కోట్లు చెల్లించేలా చూడాలని ఎరోస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో పాటే 'అఖండ 2'కు డబ్బులు అరేంజ్ చేసిన ఫైనాన్షియర్లు సైతం విడుదలకు అడ్డు పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం డబ్బులు కడితేనే మూవీ రిలీజ్‌కు మార్గం సుగమం అవుతుంది.