Akhanda 2 Release Postpone: బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఇప్పటికే ప్రీమియర్స్‌ రద్దు అయ్యాయని బాధతో ఉన్న వారికి మరో షాకింగ్ ప్రకటన వచ్చింది. ఏకంగా సినిమా రిలీజ్‌నే వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దీన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో థియేటర్లలో అఖండ తాండవం చూపించబోతున్నందన్న టైంలో నిర్మాణ సంస్థ షాకింగ్ ప్రకటన చేసింది. సాంకేతికత కారణాలతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. 

Continues below advertisement

'అఖండ 2' విడుదలకు కొన్ని గంటల ముందు ఊహించని చిక్కులు చుట్టుముట్టాయి. చిత్ర నిర్మాతలకు బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌కు మధ్య నెలకొన్న వివాదలే ఈ చిత్రం విడుదలకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో ఆర్థిక వివాదాలు, కోర్టు కేసులు కారణంగా సినిమా రిలీజ్‌కు రెడ్ సిగ్నల్ వేసినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడెప్పుడో మహేష్‌ బాబు సినిమాలు విడుదల టైంలో  ఉన్న ఆర్థిక వివాదాలు ఇప్పుడు కోర్టుల వరకు వెళ్లినట్టు వివిధ వెబ్‌సైట్‌లు వెల్లడించాయి. గతంలో చెల్లించాల్సిన బకాయిల విషయంలో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఎరోస్ గట్టిగా పట్టుబట్టిందని కోర్టుల్లో స్టే తెచ్చిందని సమాచారం. దీంతో చిత్ర నిర్మాతల ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఓవైపు కోర్టు జోక్యం చేసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చిత్ర విడదలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 

మొదట ప్రీమియర్స్ రద్దు 

14 రీల్స్ ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న 'అఖండ 2' డిసెంబర్ ఐదున విడుదల కానుంది. ముందుగానే తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌ షోలు వేయాలని కూడా నిర్ణయించారు. అయితే ఆఖరి నిమిషంలో కోర్టుల జోక్యంతో వాటిని మొదట వాయిదా వేశారు. కేవలం భారత్‌లోని ప్రీమియర్స్ మాత్రమే వాయిదా పడినట్టు చెప్పారు. తర్వాత అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. అర్థరాత్రికి సినిమాను వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ పేర్కొంది. 

Continues below advertisement