Balakrishna Akhanda 2 Will Be Released In 3D Format : థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం... బాలయ్య ఫ్యాన్స్‌కు ఈ న్యూస్ వింటే నిజంగా పూనకాలే. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ డివోషనల్ టచ్ హై యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2 తాండవం.' ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... ఆ హైప్ మరింత పెంచేలా మూవీ టీం మరో అనౌన్స్‌మెంట్ చేసింది.
3D ఫార్మాట్‌లో మూవీ రిలీజ్
ఈ మూవీని 3D ఫార్మాట్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప ఎక్స్‌పీరియన్స్ పంచే సినిమాల్లో ఇదొకటి కానుందని టీం పేర్కొంది. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ 'అఖండ 2' బిగ్ రివీల్ అంటూ ప్రకటన చేసింది. దీంతో హైప్ పదింతలు అవుతోంది. అటు హిమాలయాల నుంచి ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలను గ్లింప్స్, సాంగ్‌లో చూపించారు. వీటిని 3D ఫార్మాట్‌లో చూస్తే అత్యద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్ చేస్తుండగా... ఒకటి అఘోర పాత్ర అయితే మరొకటి మురళీ కృష్ణ రోల్. బాలయ్య అఖండ రుద్ర తాండవం నుంచి బ్లాస్టింగ్ రోర్ వరకూ రెండు రోల్స్‌లో చెప్పిన డైలాగ్స్, యాక్షన్ వేరే లెవల్‌లో ఉన్నాయి.
దీంతో పాటే తమన్ బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రీసెంట్‌గా ఫస్ట్ సాంగ్ 'తాండవం' లిరికల్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ పాటలో నిజంగానే బాలయ్య రుద్ర తాండవం చూపించారు. చేతిలో త్రిశూలం, ఢమరుకంతో సాక్షాత్తూ శివుడే నేలకు దిగి వచ్చాడా? అనేలా ఉంది ఈ పాట. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా... ఫేమస్ సింగర్స్ శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్, దీపక్ బ్లూ పాడారు. ఈ సాంగ్ కామన్ ఆడియన్స్‌తో పాటు బాలయ్య ఫ్యాన్స్, శివయ్య భక్తులకు పూనకాలు తెప్పించేలా ఉంది. మేకింగ్ వీడియో సైతం అదిరిపోయింది.
రిలీజ్ ఎప్పుడంటే?
2021లో వచ్చిన 'అఖండ'కు సీక్వెల్‌గా 'అఖండ 2' తెరకెక్కుతోంది. బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. హర్షాలి మెహతా కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట మూవీని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.