నో మోర్ డౌట్స్... క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ దర్శకుడు అని మరోసారి బాఫ్టా అనౌన్స్ చేసింది. 'ఓపెన్ హైమర్' చిత్రానికి  గాను ఆయన్ను ఉత్తమ దర్శకుడి పురస్కారం వరించింది. ఈ ఏడాది ఆ సినిమాకు మొత్తం మీద ఏడు అవార్డులు వచ్చాయి. ఇక, 'పూర్ థింగ్స్' సినిమాకు ఐదు అవార్డులు వచ్చాయి. మరి, ఈ ఏడాది ఉత్తమ నటీనటులుగా ఎవరెవరు అవార్డులు అందుకున్నారో చూడండి. 


బాఫ్టా... 'బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్' అవార్డుల్లో క్రిస్టోఫర్ నోలన్ తీసిన 'ఓపెన్ హైమర్' సినిమాకు ఏడు వచ్చాయి. ఉత్తమ సినిమా సహా దర్శకుడు, నటుడు, సహాయ నటుడు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ సినిమా సత్తా చాటింది. నామినేషన్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి 'ఓపెన్ హైమర్' సినిమాకు ఎక్కువ అవార్డులు వస్తాయని అందరూ ఊహించారు. అనుకున్నట్టుగా వచ్చాయి. మొత్తం 13 విభాగాల్లో నామినేషన్స్ రాగా... ఏడు విభాగాల్లో విజేతగా నిలిచింది. 


హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచం నలుమూలల ప్రజలకు ఎంతగానో నచ్చిన, థియేటర్లలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న 'బార్బీ' సినిమాకు ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం. 


బాఫ్టా అవార్డుల 2024 విజేతలు ఎవరో చూడండి:



  • ఉత్తమ సినిమా : ఓపెన్ హైమర్ (క్రిస్టోఫర్ నోలన్, చార్లెస్ రోవెన్, ఎమ్మా థామస్)

  • ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్ సినిమా)

  • ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫి (ఓపెన్ హైమర్ సినిమా)

  • ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్ సినిమా)

  • ఉత్తమ సహాయ నటి: డావిన్ జాయ్ రాండాల్ఫ్ (ది హోల్డవర్స్ సినిమా)

  • ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్ సినిమా)

  • ఉత్తమ ఛాయాగ్రహణం: Hoyte van Hoytema (ఓపెన్ హైమర్ సినిమా)

  • ఉత్తమ నేపథ్య సంగీతం (ఒరిజినల్ స్కోర్): Ludwig Göransson (ఓపెన్ హైమర్ సినిమా)


Also Readభ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్... మరి సినిమా? లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?



  • ఎడిటింగ్: జెన్నిఫర్ (ఓపెన్ హైమర్ సినిమా)

  • ఒరిజినల్ స్క్రీన్ ప్లే: అనాటమీ ఆఫ్ ఎ ఫాల్!

  • అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: అమెరికన్ ఫిక్షన్ సినిమా!

  • ప్రొడక్షన్ డిజైన్: పూర్ థింగ్స్ సినిమా

  • స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్: పూర్ థింగ్స్ సినిమా

  • మేకప్ అండ్ హెయిర్: పూర్ థింగ్స్ సినిమాకు గాను నాడియా, మార్క్ కౌలిర్, జోష్ వెస్టన్.

  • కాస్ట్యూమ్ డిజైనర్: హొలీ వడ్డింగ్టన్ (పూర్ థింగ్స్ సినిమా)

  • అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (జోనాథన్ గ్లాజర్, జేమ్స్ విల్సన్)

  • బెస్ట్ డాక్యుమెంటరీ: 20 Days in Mariupol


Also Read: అమెరికాలో ఉంటూ ఇండియాలో సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు - 'ఇంద్రాణి' ట్రైలర్ లాంచ్‌లో అనిల్ సుంకర