Just In





Ayudha Pooja Video Song: ఎన్టీఆర్ కెరీర్‌లో వన్నాఫ్ ది బెస్ట్ సాంగ్ 'ఆయుధ పూజ' ఫుల్ వీడియో వచ్చేసింది
Devara Full Video Songs: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్, పాన్ ఇండియా హిట్ 'దేవర' సినిమాలో 'ఆయుధ పూజ' ఫుల్ సాంగ్ విడుదల చేశారు. ఆ వీడియో చూడండి.

'దేవర' థియేటర్లలో అభిమానుల చేత మాత్రమే కాదు... సామాన్య ప్రేక్షకులు సైతం కాలు కదిపేలా చేసిన పాట 'ఆయుధ పూజ'. ఆ పాటలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR Jr) డాన్స్ మామూలుగా లేదు. ఆ గ్రేస్, ఆ మాస్... పాటను ఫుల్ హిట్ చేశాయి. ఇప్పుడు ఆ పాట ఫుల్ వీడియో వచ్చింది.
ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ చేసిన 'దేవర' టీం!
ఎన్టీఆర్ కథానాయకుడిగా ఓ సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరూ మంచి డాన్స్ నెంబర్ ఆశిస్తారు. 'దేవర' సినిమాలో అటువంటి పాట 'ఆయుధ పూజ' అని చెప్పాలి. అదొక పాట అని ఎన్టీఆర్ భావించి డాన్స్ చేయలేదు. ఆ పాటను ఆయన ఫీల్ అయ్యారు. అందుకే అంత అద్భుతంగా డాన్స్ చేశారు. తన్మయత్వంతో పరవశించి మరి శివతాండవం తరహాలో ఆ పాటలో ఆయన నృత్యం సాగింది. ఇప్పుడు ఆ సాంగ్ ఫుల్ వీడియో యూట్యూబ్ వేదికగా విడుదల చేశారు.
Watch Ayudha Pooja Song Full Video: కథానాయకుడిగా ఎన్టీఆర్ ప్రయాణం చూస్తే... ఆయన బెస్ట్ డాన్స్ నంబర్లలో ఆ పాట కూడా ఉంటుందని అభిమానులతో పాటు ప్రేక్షకుల సైతం చెబుతున్నారు. ఇప్పుడు ఆ సాంగ్ డిజిటల్ సోషల్ మీడియాలలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వచ్చేసింది.
'దేవర' విడుదలైన తర్వాత మరి ముఖ్యంగా ఒంటి గంట బెనిఫిట్స్ పడిన తర్వాత సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. సూపర్ డూపర్ హిట్, పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు. అయితే అది వసూళ్ల మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఎన్టీఆర్ స్టార్ పవర్, ఆయన మాస్ ఇమేజ్ కలిసి థియేటర్లకు జనాలను రప్పించింది. దాంతో సినిమాకు 600 కోట్లకు పైగా వసూలు వచ్చాయి. ఈ విజయం ఎన్టీఆర్ చిత్ర బృందానికి మాత్రమే కాదు... తెలుగు సినిమా దర్శక - నిర్మాతలకు ఒక భరోసా ఇచ్చింది.
Also Read: 'పొట్టేల్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... డబ్బా కొట్టడం కాదు, 'రంగస్థలం' టైపులో!
'దేవర' విజయం తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న ఎన్టీఆర్... ఇప్పుడు కొత్త సినిమా పనులు ప్రారంభించారు. ఈ సినిమా విడుదలకు ముందు ఆయన బాలీవుడ్ సినిమా 'వార్ 2' షూటింగ్ స్టార్ట్ చేశారు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఆయన కలిసి ఆ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ రాజ్ ఫిలిమ్స్ సినిమా అది. అది కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక పాన్ ఇండియా సినిమా (డ్రాగన్) చేయమన్నారు. ఆ రెండు సినిమాలు విడుదలైన తర్వాత 'దేవర 2' సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.