Tarot Movie Trailer: టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన అవంతిక వందనపు.. అనూహ్యంగా కొన్నేళ్ల తర్వాత హాలీవుడ్‌లో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ‘మీన్ గర్ల్స్‌’ అనే సిరీస్‌లో కనిపించి హాలీవుడ్‌లో పాపులర్ అయిపోయింది అవంతిక. ఇంతలోనే తను నటించిన మరో హాలీవుడ్ మూవీ ‘టారో’ (Tarot) కూడా థియేటర్లలో విడుదల అవ్వడానికి సిద్ధమవుతోంది. ‘టారో’ఒక హారర్ మూవీ. ఇప్పటికే హాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అవంతిక.. ఇలాంటి ఒక హారర్ మూవీలో నటిస్తుంది అనే విషయం మరోసారి ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.


మీ విధి ఈ కార్డ్స్‌లో ఉంది..


2024 మే 10న ‘టారో’ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని అవంతిక వందనపు సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘సోనీ పిక్చర్స్ నుండి వస్తున్న టారో మే నుండి థియేటర్లలోకి రానుంది. మీ విధి ఈ కార్డ్స్‌లో ఉంది’ అంటూ అవంతిక ‘టారో’ నుండి తన క్యారెక్టర్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే.. కొందరు స్నేహితులు కలిసి ‘టారో’ కార్డ్స్‌తో తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో ఆ కార్డ్స్‌కు సంబంధించిన రూల్స్‌ను అతిక్రమిస్తారు. దీంతో ఆ కార్డ్స్‌లో ట్రాప్ అయ్యి ఉన్న దెయ్యాన్ని బయటికి తీసుకొస్తారు. దాని వల్ల ఒకరి తర్వాత ఒకరుగా దారుణంగా చనిపోతూ ఉంటారు.






ట్రైలర్‌‌తో క్లారిటీ..


టైటిల్, ట్రైలర్‌ను బట్టి చూస్తే ‘టారో’ కార్డ్స్ వల్లే సమస్యలు మొదలవుతాయని స్పష్టమవుతోంది. హారియెట్ స్లాటర్, అడైన్ బ్రాడ్లే, అవంతిక, జాకోబ్ బాటలాన్ వంటి నటీనటులు ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. స్పెన్సర్ కోహెన్, ఆన్నా హాల్బెర్గ్ కలిసి ఈ హారర్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. లెస్లీ మార్గెన్స్‌టెయిన్, ఎలిసా కాప్లోవిట్జ్ డటన్, స్కాట్ గ్లాస్‌గోల్డ్.. ‘టారో’కు నిర్మాతలుగా వ్యవహరించారు. సోనీ పిక్చర్స్.. ఈ సినిమాను భారీ ఎత్తులో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. మామూలుగా హాలీవుడ్‌లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకే ‘టారో’ చిత్రంతో అవంతికకు హాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు.



హాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు..


‘మీన్ గర్ల్స్’ అనేది పాపులర్ హాలీవుడ్ సినిమా ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ నుంచి తాజాగా మరో చిత్రం విడుదలయ్యింది. ఇందులో అవంతిక వందనపు కూడా ఒక లీడ్ రోల్‌లో నటించడం చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంత త్వరగా ఎదిగిపోయింది అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు తను చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సినిమాలతో.. ఇప్పుడు తనను పోల్చి చూస్తూ ఆశ్చర్యపోయారు. ఇక టాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన అవంతిక.. అక్కడే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


Also Read: హృతిక్ రోషన్‌ కంటే అల్లు అర్జున్ అంటేనే ఇష్టం - నోరా ఫతేహి