Nora Fatehi about Allu Arjun: ఒకప్పుడు టాలీవుడ్ నటీనటుల క్రేజ్ ఎక్కువశాతం సౌత్ వరకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు తెలుగు నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ వరల్డ్ వైడ్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు మన హీరోలు. అలాంటి హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. తాజాగా బాలీవుడ్ ఐటెమ్ గర్ల్ నోరా ఫతేహి కూడా తనకు ఇతర హీరోలతో పోలిస్తే.. అల్లు అర్జున్ అంటేనే ఎక్కువగా ఇష్టమని చెప్తూ.. బన్నీకి తాను ఫిదా అయిన సందర్భం గురించి చెప్పుకొచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు.


ఆ ఉద్దేశ్యంతో చెప్పడం లేదు..


హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్, అల్లు అర్జున్.. ఈ నలుగురిలో ఒక హీరోను ఎంపిక చేసుకోమని నోరా ఫతేహికి ప్రశ్న ఎదురయ్యింది. దానికి వెంటనే అల్లు అర్జున్ అంటూ సమాధానమిచ్చింది నోరా. ‘‘సౌత్ ఇండస్ట్రీ బాగుందని నేను ఈ సమాధానం చెప్తున్నానని అనుకుంటారు కానీ కాదు.. మీరు అల్లు అర్జున్‌ను చూడాల్సింది అప్పుడు అర్థమవుతుంది. నేను హృతిక్ పేరు చెప్పేదాన్ని. ఎందుకంటే నాకు హృతిక్ అంటే చాలా ఇష్టం. తను ఇండస్ట్రీ కోసం ఏం చేస్తాడో అదంతా నాకు చాలా ఇష్టం’’ అంటూ హృతిక్ రోషన్ అంటే తనకు ఇష్టమని చెప్తూనే.. హృతిక్ కంటే ఎక్కువ అల్లు అర్జున్ అంటే ఇష్టమని చెప్పింది నోరా ఫతేహి.


‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో’


‘‘తాజాగా అల్లు అర్జున్ వీడియో ఒకటి చూశాను. నాకు పాట గుర్తులేదు. కానీ అందులో తను క్యాప్‌తో డ్యాన్స్ చేస్తున్నాడు. ఒక్కసారిగా చూసి షాక్ అయ్యాను. తను చాలా రాకింగ్. నేను ఒక్కసారిగా క్రిస్ బేల్‌ను చూస్తున్నానేమో అనుకున్నాను’’ అంటూ అల్లు అర్జున్‌కు తను ఫిదా అయిన మూమెంట్ గురించి చెప్పుకొచ్చింది నోరా ఫతేహి. అయితే నోరా చెప్పింది ‘నా పేరు సూర్య’లోని ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో’ పాట గురించే అని చాలామంది మూవీ లవర్స్‌కు అర్థమయ్యింది. అప్పట్లో ఈ సాంగ్ ఒక సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిసాస్టర్ అయినా.. అందులో బన్నీ స్టైల్‌కు, లుక్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక పాటలు అయితే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయంటూ ప్రశంసించారు.






మెగా హీరోలతో స్టెప్పులు..


ఐటెమ్ గర్ల్‌గా పాపులర్ అయిన నోరా ఫతేహి.. తెలుగులో కూడా పలు స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. అదే క్రమంలో పలువురు మెగా హీరోలతో కలిసి స్టెప్పులు కూడా వేసింది. కానీ తనకు ఎంతో ఇష్టమైన అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం మాత్రం నోరాకు రాలేదు. ఇక తాజాగా తనకు బన్నీపై ఇష్టాన్ని బయటపెట్టింది కాబట్టి మేకర్స్.. ఈ వీడియోను చూసి తనకు అల్లు అర్జున్‌తో చేసే అవకాశం ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రస్తుతం నోరా.. మెగా హీరో వరుణ్ తేజ్ లీడ్ రోల్ చేస్తున్న ‘మట్కా’లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ మూవీ నుండి విడుదలయిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది.


Also Read: దిల్ రాజుకు చదలవాడ సాయం - ఇప్పుడు 'ధీర'కు ఆయన!