Americans Trolls On Avantika Vandanapu: చాలామంది ఇండియన్ సినీ సెలబ్రిటీలకు హాలీవుడ్‌లో అడుగుపెట్టాలని కోరిక ఉంటుంది. కానీ ఈ 19 ఏళ్ల ఇండియన్ అమెరికన్ యాక్టర్ మాత్రం హాలీవుడ్‌లో రోజురోజుకీ విపరీతమైన ఫేమ్ సంపాదించుకుంటూ ముందుకెళ్తోంది. తను మరెవరో కాదు.. అవంతిక వందనపు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగులో పలు చిత్రాల్లో నటించిన అవంతిక.. ఆ తర్వాత హాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఒక తెలుగమ్మాయి హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్నా కూడా చాలామంది తెలుగువారు తనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అమెరికన్స్ చేత కూడా ట్రోలింగ్ ఎదుర్కుంటోంది ఈ భామ.


ఆ పాత్ర కోసమే..


కొన్ని ఎవర్‌గ్రీన్ యానిమేషన్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది డిస్నీ. గత కొన్నేళ్లలో ఒకటి తర్వాత ఒకటిగా ఒకప్పుడు విడుదలయిన యానిమేషన్ సినిమాలను లైవ్ యాక్షన్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఆ లిస్ట్‌లో ఇప్పుడు ‘ట్యాంగిల్డ్’ కూడా యాడ్ అయ్యింది. అయితే ఇప్పటివరకు యానిమేషన్ వర్షన్‌లో ఉన్న ‘ట్యాంగిల్డ్’కు ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ మూవీలోని లీడ్ రోల్ అయిన ర్యాపున్జెల్ అనే యువరాణి పాత్రను అవంతిక చేయనున్నట్టు హాలీవుడ్‌లో రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దీనికోసం హీరో మిలో మ్యాన్హెమ్‌తో కలిసి అవంతిక టెస్ట్ షూట్‌లో కూడా పాల్గొందని సమాచారం.


సెట్ అవ్వదు..


ర్యాపున్జెల్ లాంటి వైట్ గర్ల్ పాత్రను ఒక ఇండియన్ అమెరికన్ పోషించనుందనే విషయం చాలామంది హాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. అందులో చాలామంది అవంతిక ఇన్‌స్టాగ్రామ్‌లో నెగిటివ్‌గా కామెంట్స్ చేయడం కూడా మొదలుపెట్టారు. తనను ట్రోల్స్ చేస్తూ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ర్యాంపున్జెల్ పాత్రకు అవంతిక అస్సలు కరెక్ట్ కాదని కొందరు ఓపెన్‌గా స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ‘ట్యాంగిల్డ్’ అనే సినిమా చాలామంది యానిమేషన్ లవర్స్‌కు ఇప్పటికీ ఫేవరెట్. అందులో ర్యాపున్జెల్.. ఒక కోటలో చిక్కుకున్న యువరాణి పాత్రలో కనిపిస్తుంది. అలాంటి పాత్ర అవంతికకు అస్సలు సెట్ అవ్వదంటూ సోషల్ మీడియా అంతటా తనపై నెగిటివిటీ ఏర్పడింది.






నిజమే అయ్యిండొచ్చు..


తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్‌పై అవంతిక ఇంకా స్పందించలేదు. పైగా తను నిజంగానే ర్యాపున్జెల్ పాత్రలో నటిస్తుందా లేదా కూడా ప్రకటించలేదు. కేవలం తను ఒక ఇండియన్ అమెరికన్ యాక్టర్ అవ్వడం వల్ల తనపై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డిస్నీ నిర్మాణంలో తెరకెక్కిన ‘స్పిన్’ అనే చిత్రంలో అవంతిక నటించింది. దీంతో ‘ట్యాంగిల్డ్’ తెరకెక్కుతుందని వస్తున్న వార్తలు నిజమే అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అందులో అవంతిక.. ర్యాపున్జెల్‌గా నటించడం కూడా ఖాయమని చాలామంది అనుకుంటున్నారు. మరి అవంతిక ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.



Also Read: ప్రభాస్‌ 'కల్కి 2989 ఏడీ' రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌, తెరపైకి మరో కొత్త డేట్‌? - ఆ రోజే బిగ్‌ అప్‌డేట్‌!