Ashok Galla's Vintara Saradaga First Look Released: 'హీరో' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ఫస్ట్ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'దేవకీ నందన వాసుదేవ' అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు ట్రాక్ మార్చి మరో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 

డిఫరెంట్ టైటిల్

ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా... కొత్త డైరెక్టర్ ఉద్భవ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'VISA - వింటారా సరదాగా' అంటూ డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేయగా ఫస్ట్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్‌లో గల్లా అశోక్ స్టైలిష్ అండ్ కూల్ లుక్‌లో అదరగొట్టారు. 'కలలు, నాటకం, లవ్‌తో కూడిన డిఫరెంట్ రైడ్' అంటూ రాసుకొచ్చారు. 

అశోక్ గల్లాతో పాటు శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. టీజర్‌ను శనివారం ఉదయం 10:53 గంటలకు రిలీజ్ చేయనున్నారు. 

Also Read: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోన్న బ్లాక్ బస్టర్ 'కుబేర' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

బ్యాక్ డ్రాప్ ఏంటంటే?

అమెరికాలో సెటిల్ కావాలని కలలు కనే ఎంతోమంది విద్యార్థుల కలలు, భారతీయ విద్యార్థుల జీవితాలు, వారి కలలు, అక్కడ ఎదుర్కొనే అనుభవాలను సినిమాలో చూపించనున్నారు. లవ్, ఫ్రెండ్స్ అన్నింటినీ ఎమోషన్‌తో కూడిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే ఎమోషన్ యూత్‌కు కావాల్సిన అన్నీ అంశాలు ఉన్నాయని... ఆడియన్స్‌ను ఎంతో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు.