Dhanush's Kuberaa OTT Release Date: కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేర' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గత నెల 20న మూవీ రిలీజ్ కాగా... నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా ఈ నెల 18 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. 'ఓ సామాన్యుడు... సులభం కాని ప్రయాణం.' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రైమ్ వీడియో అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా... నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. సినిమాలో బిచ్చగాడి రోల్‌లో ధనుష్, సీబీఐ ఆఫీసర్‌గా నాగార్జున, అమాయక యువతిగా రష్మిక నటించారు. వీరితో పాటే జిమ్ సర్బ్, దలీప్ తాహిల్, ప్రియాంశు ఛటర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించారు. విడుదలైన 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన ఆర్జీవీ 'శారీ' మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
స్టోరీ ఏంటంటే?
దేశంలోనే అత్యంత సంపన్నుడు నీరజ్ మిత్రా (జిమ్ సర్బ్) ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావాలని కలలు కంటాడు. ఇదే టైంలో బంగాళాఖాతంలో భారీ ఆయిల్ రిగ్ బయటపడుతుంది. తన డబ్బు, పలుకుబడితో దాన్ని సొంతం చేసుకునేందుకు రూ.లక్ష కోట్లతో ప్రభుత్వంతో డీల్ మాట్లాడుకుంటాడు నీరజ్. అయితే, రూ.50 వేల కోట్లు బ్లాక్, రూ.50 వేల కోట్లు వైట్‌గా ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు కండిషన్ పెడతారు. తన చేతికి మట్టి అంటకుండా ఆ డబ్బును వారి అకౌంట్లలోకి చేర్చేందుకు ప్లాన్ చేస్తాడు నీరజ్. ఇందుకోసం నిజాయతీ పరుడైన దీపక్ సాయం తీసుకుంటాడు.
ఓ మంత్రి ఇంటిపై రైడ్ చేసినందుకు సిన్సియర్ సీబీఐ ఆఫీసర్ దీపక్‌ను అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తారు. దీంతో దీపక్‌ను తన పలుకుబడితో బయటకు తీసుకొచ్చి ఆ డబ్బును వారి అకౌంట్లలోకి చేరేలా ప్లాన్ చేస్తాడు నీరజ్. ఇందుకు దీపక్ దేవా (దనుష్)తో పాటు మరో ముగ్గురు అనాథలను సెలక్ట్ చేసుకుంటాడు. వారి పేరు మీద విదేశాల్లో బినామీ కంపెనీలు సృష్టించి వారి అకౌంట్లలోకి డబ్బులు చేరవేస్తాడు. అలా చేరిన వెంటనే ఒక్కొక్కరినీ దీపక్‌కు తెలీకుండా చంపేస్తుంటాడు నీరజ్. అయితే, నీరజ్ గ్యాంగ్ నుంచి తప్పించుకుంటాడు దేవా. ఆ తర్వాత ఏం జరిగింది? రూ.10 వేల కోట్ల కోసం నీరజ్ బిచ్చగాడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆ రూ.10 వేల కోట్లను దేవా ఏం చేశాడు? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.