సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'హీరో' సినిమాతో డెబ్యూ ఇచ్చిన అశోక్‌ ఆశించిన విజయం అందుకోలేకపోయాడు. ఈ సినిమా రిజల్ట్‌ నిరాశ పరిచిన యాక్టింగ్‌లో మాత్రం ఘట్టమనేని వారసత్వాన్ని చాటాడు. ఇప్పుడు 'దేవకి నందన వాసుదేవ్' మూవీతో హిట్‌ కొట్టేందుకు రేడి అవుతున్నాడు. ఈ సినిమాలో మోడల్‌, ఫెమినా మిస్‌ ఇండియా 2020 మానస వారణాసితోత జతకట్టాడు. గుణ 369' ఫేం అర్జున్‌ జంద్యాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. హను-మాన్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ స్క్రిన్‌ ప్లే అందించారు.


యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్‌ పతాకంపై ఎన్‌ఆర్ఐ సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వదిలింది మూవీ టీం. తాజాగా మూవీ టీజర్‌ రిలీజ్‌ కాగా ఇందులోని అశోక్‌ గల్లా లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్‌ గా వస్తున్న ఈ సినిమా టీజర్‌ అద్యంతం ఆసక్తికరంగా సాగింది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో విడుదల చేసిన టీజర్‌లో ఫైట్స్, యాక్షన్, లవ్‌ సీన్స్‌ బాగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ కి భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. ఇందులో మానస వారణాసి గ్లామర్‌ మరింత ప్లస్‌ కానుందనిపిస్తోంది. మొత్తానికి యాక్షన్‌ సీన్స్‌లో అశోక్‌ లుక్‌ మరింత ఎలివేషన్‌ ఇచ్చింది. మొత్తానికి టీజర్‌ పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో ఈసారి అశోక్‌ గల్లా మంచి కమర్షియల్‌ హిట్‌ కొట్టడం పక్కా అని అభిప్రాయపడుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్‌. 


టీజర్‌ ఎలా సాగిందంటే..


ప్రారంభంలోనే టీజర్‌లో సస్పెన్స్‌ నెలకొంది. "నీ బిడ్డకు మరణ గండం.. లేదా మరోకరికి అతడి చేతిలో మరణం" అంటూ వచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌ ఉత్కంఠ పెంచుతోంది. ఆ వెంటనే వచ్చిన యాక్షన్‌ సీన్స్‌ మంచి థ్రిల్లింగ్‌ని ఇచ్చాయి. బురదలో యాక్షన్‌ సీన్‌ టీజర్‌కు హైలెట్‌ అని చెప్పాలి. ఇక ఆ తర్వాత హీరో లుక్‌ మరింత ఆసక్తిని పెంచుతుంది. మొఖం నిండా నెత్తుడి మరకలతో అశోక్‌ ఇంటెన్సీవ్‌ లుక్‌లో కనిపించాడు. హీరోయిన్‌ లుక్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిందనడంలో సందేహం లేదు. హీరోహీరోయిన్‌  మధ్య లవ్‌, రొమాంటిక్‌ సీన్స్‌  ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ మధ్య మధ్యలో శ్రీ కృష్ణుడిని చూపించడం, గుడి, హోమం వంటి సీన్స్‌ సెస్పెన్స్‌ నెలకొంది. ఏ కాలంలో అయినా ఈ భూమి మీద దేవుడు కంటే రాక్షసుడే ముందు పుడతాడు.. వాడిని చంపటానికై దేవుడు పుడతాడు" అంటూ వచ్చే మాటలు ఆసక్తిని పెంచుతున్నాయి. టీజర్‌లో ప్రశాంత్‌ వర్మ నేరేషన్‌ మార్క్‌ కనిపిస్తుంది. మొత్తానికి టీజర్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తుందనడంలో సందేహమే లేదు. ఫస్ట్ మూవీతో ఘట్టమనేని అభిమానులను నిరాశ పరిచిన అశోక్ గల్లా మరి ఈ మూవీతో అయినా హిట్ కొడతాడో లేదో చూడాలి.



Also Read: నన్ను బాడీ షేమింగ్ చేశారు, అదే నాకు ఎనర్జీ డ్రింక్ - విజయ్ సేతుపతి