Actress Shalini Pandey On Telugu Film Industry: షాలిని పాండే. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే అద్భుత గుర్తింపు తెచ్చుకుంది. ప్రీతి పాత్రలో అమాయకపు అమ్మాయిలా అలరించింది. ఈ సినిమాలో అమ్మడి నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ మూవీ తర్వాత షాలినికి వరుస అవకాశాలు వచ్చాయి.  '118', '100 % కాదల్​', 'ఇద్దరి లోకం ఒకటే', 'జయేష్​ భాయ్ జోర్డార్'​ లాంటి సినిమాల్లో మెరిసింది. తెలుగు, హిందీతో పాటు, తమిళంలోనూ ఛాన్సులు వచ్చాయి. గత కొంతకాలంగా బాలీవుడ్ లో రాణిస్తోంది. చక్కటి నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఓటీటీలోకి అడుగు పెట్టబోతుంది. రెండు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అటు బాలీవుడ్ మూవీ 'మహారాజా'లోనూ కనిపించనుంది. సినిమాలతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ లోనూ కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తెలుగు సినిమా పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలని ఉంది- షాలిని పాండే


ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లు చెప్పింది షాలిని పాండే. ‘అర్జున్ రెడ్డి‘ సినిమాలో అవకాశం రావడం పట్ల ఎంతో సంతోషంగా ఫీలైనట్లు తెలిపింది. తెలుగుతో పాటు హిందీ(‘కబీర్ సింగ్‘) లోనూ ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. “‘కబీర్ సింగ్’ సినిమాను ఎప్పుడూ రీమేక్ చిత్రంగా చూడలేదు. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీ కెమిస్ట్రీ చక్కగా ఉంది. ప్రీతి క్యారెక్టర్ లో నేను, కియారా చాలా బాగా నటించాం. చక్కటి భావోద్వేగాలను కనబరిచాం. ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించాను. ఏదో ఒక భాషలో నటించాలనే పట్టింపు ఏమా లేదు. మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలని ఉంది. నేను తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా వెండితెరపైకి అడుగు పెట్టాను. తెలుగు అమ్మాయిని కాకపోయినా, నా తొలి సినిమాకు ఇక్కడి ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ కనిపించింది. వారి ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేను” అని షాలిని పాండే వెల్లడించింది.


సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్


ఓ వైపు అడపాదడపా సినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. అమ్మడు అందచందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. మరోవైపు తన గ్లామర్ మెరుపులకు సినిమా అవకాశాలు సైతం వస్తాయని భావిస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఓటీటీ ప్రాజెక్టులతో పాటు ‘మహారాజా’ సినిమా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటాయని భావిస్తోంది.  






Read Also: అప్పుడు విమర్శలు, ఇప్పుడు ప్రశంసలు - రష్మిక నటనకు నెటిజన్లు ఫిదా


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply