Varun Tej and Lavanya Tripathi, the newly married celebrity couple, are off on their honeymoon tour : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఆయన సతీమణి & హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎక్కడ ఉన్నారో తెలుసా? హనీమూన్ టూర్‌లో! అవును... ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇండియాలో లేరు. విదేశాల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లారు? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
ఫిన్ ల్యాండ్ వెళ్లిన స్టార్ కపుల్!
Varun Tej and Lavanya Tripathi honeymoon in Finland: కొత్తగా పెళ్ళైన స్టార్ కపుల్ వరుణ్ & లావణ్య ప్రజెంట్ ఫిన్ ల్యాండ్ లో ఉన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. ఫిన్ ల్యాండ్ నుంచి మరొక ప్రదేశానికి కూడా వెళతారని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది. ఓ వారం లేదా 10 రోజుల పాటు టూర్ ఉండొచ్చని ఖబర్.
ఫిన్ ల్యాండ్ అంటే మెగా ఫ్యామిలీకి ఇష్టం అనుకుంట! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కొన్నాళ్ల క్రితం ఆ మంచు ప్రదేశానికి వెళ్లారు. ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య దంపతులు సైతం అక్కడికి వెళ్లారు.
Also Read: క్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?
పెళ్లి విదేశాల్లో జరిగినప్పటికీ...
ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఏడు అడుగులు వేశారు. పెళ్లి విదేశాల్లో జరిగినప్పటికీ... త్వరగా ఇండియా వచ్చేశారు. పెళ్లి జరిగిన మూడు రోజులకు కొత్త జంట హైదరాబాద్ సిటీలో అడుగు పెట్టింది. ఇక్కడ రిసెప్షన్ జరిగింది. ఆ తర్వాత డెహ్రాడూన్‌లోని అత్తారింటికి వరుణ్ తేజ్ వెళ్లారు. లావణ్య త్రిపాఠి బంధు మిత్రుల కోసం అక్కడ మరో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అన్ని పనులు పూర్తి కావడంతో కాస్త వెసులుబాటు చేసుకుని ఇప్పుడు హనీమూన్ టూర్ వేశారు.
'ఆపరేషన్ వేలంటైన్' వాయిదా పడటం కూడా...
Varun Tej Upcoming movie 2024 - Operation valentine: వరుణ్ తేజ్ హనీమూన్ టూర్ వేయడం వెనుక 'ఆపరేషన్ వేలంటైన్' వాయిదా కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమాను తొలుత డిసెంబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... వచ్చే ఏడాదికి ఆ సినిమా వాయిదా పడటంతో వరుణ్ తేజ్ (Varun Tej)కు కొంత ఫ్రీ టైమ్ దొరికింది. లేదంటే ఆయన 'ఆపరేషన్ వేలంటైన్' ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండేవారు.
Also Read: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న హాట్ లేడీ ఎవరో తెలుసా?
హనీమూన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో హీరోగా నటించనున్న 'మట్కా' చిత్రీకరణలో వరుణ్ తేజ్ జాయిన్ అవుతారు. లావణ్యా త్రిపాఠి యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే... డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. అందులో ఆమెకు జోడీగా 'బిగ్ బాస్' విన్నర్ అభిజీత్ నటిస్తున్నారు. అది కాకుండా మరో సినిమాకు ఆమె సంతకం చేసినట్లు తెలిసింది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply