బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ (Arbaaz Khan) తెలుసుగా! బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు. హిందీలో నటుడిగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో కూడా ఆ మధ్య సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథతో రూపొందిన 'జై చిరంజీవా' సినిమాలో విలన్ రోల్ చేశారు. అది ఆయనకు ఫస్ట్ తెలుగు సినిమా. ఆ తర్వాత రాజ్ తరుణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాలోనూ విలన్ రోల్ చేశారు. ఏడేళ్ల విరామం తర్వాత మరో తెలుగు సినిమాకు సంతకం చేశారు అర్భాజ్ ఖాన్. ఆ వివరాల్లోకి వెళితే...
అశ్విన్ బాబు సినిమాలో అర్భాజ్ ఖాన్!
యువ కథానాయకుడు అశ్విన్ బాబు తెలుసుగా! 'జీనియస్', 'రాజు గారి గది' ఫ్రాంచైజీ, 'హిడింబ' సినిమాలతో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అర్భాజ్ ఖాన్ నటిస్తున్నారు.
ఇప్పుడు హిందీలో సినిమాలతో పాటు సౌత్ సినిమాల మీద కూడా అర్భాజ్ ఖాన్ కాన్సంట్రేట్ చేశారు. ఇటీవల మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ 'బిగ్ బ్రదర్'లో కూడా నటించారు. అశ్విన్ బాబు సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ''చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమాలో నటిస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ 1, ఒక డిఫరెంట్ కథలోని ముఖ్య పాత్ర రావడం ఇంకా ఆనందంగా ఉంది'' అని అంటున్నారు.
Also Read: ఈ టాలీవుడ్ హీరో సమంతకు మళ్లీ బ్రదర్...
నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి సినిమాలో అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా ఉంటుంది. మంగళవారం నుంచి మొదలైన కొత్త షెడ్యూల్లో ఆయన షూటింగ్లో జాయిన్ అయ్యారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని అన్నారు.
Also Read: త్వరలో సర్జరీకి రెడీ అవుతున్న 'బిగ్ బాస్' అభిజీత్... ఆయనకు ఏమైందంటే?
అశ్విన్ బాబు సరసన దిగంగన సూర్యవంశీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో 'హైపర్' ఆది, తమిళ నటుడు సాయి ధీన ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్ (కార్తికేయ 2 ఫేమ్), సంగీతం : వికాస్ బడిస, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర (హనుమాన్, మంగళవారం ఫేమ్), నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి, దర్శకత్వం : అప్సర్.