Ghaati New Release Date Announced With Trailer: క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'ఘాటి'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. 'వేదం' తర్వాత వాళ్ళిద్దరి కలయికలో రూపొందిన చిత్రమిది. తొలుత ఏప్రిల్ 29, ఆ తర్వాత జూలై 11న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక వాయిదాల్లేవ్... ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
సెప్టెంబర్ 5న అనుష్క 'ఘాటి' విడుదలసెప్టెంబర్ 5... అంటే వచ్చే నెలలో ఐదవ తేదీన 'ఘాటి' సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది. ఇకపై ఈ డేట్ మారే అవకాశం లేదు. 'ఘాటి' విడుదల తేదీని ట్రైలర్ చివరలో తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
Also Read: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు... నేను రియాక్ట్ కాను... జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై చిరంజీవి క్లారిటీ?
Vikram Prabhu to stars opposite Anushka Shetty in Ghaati: 'ఘాటి' సినిమాలో అనుష్క శెట్టి సరసన తమిళ స్టార్ విక్రమ్ ప్రభు నటించారు. వాళ్ళిద్దరి ఇంటెన్స్ అవతార్స్ ప్రేక్షకుల్లో సినిమాపై బజ్ మరింత పెంచాయి. వాళ్ళిద్దరిపై తీసిన 'సైలోరే...' పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ పాటను క్రిష్ రాసిన సంగతి తెలిసిందే.
Ghaati Movie Cast And Crew: యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'ఘాటి' తెరకెక్కింది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మాతలు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మనోజ్ రెడ్డి కటాసాని, కళా దర్శకుడు: తోట తరణి, మాటలు: సాయి మాధవ్ బుర్రా, కథ: చింతకింది శ్రీనివాసరావు, సంగీతం: నాగవెల్లి విద్యా సాగర్, కూర్పు: చాణక్య రెడ్డి తూరుపు - వెంకట్ ఎన్ స్వామి, రచన - దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి.
Also Read: ఎవరీ వెంకటేష్ నాయుడు? ఆయనతో తమన్నాకు సంబంధం ఏమిటి? గోల్డ్ - లిక్కర్ స్కాంలో మిల్కీ బ్యూటీ