Allu Arjun Anushka Shetty Phone Call Leaked: స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'ఘాటి' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రమోషన్స్ డిఫరెంట్‌గా సాగుతున్నాయి. స్వీటీ ఆఫ్ స్క్రీన్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే రానా దగ్గుబాటితో ఫోన్ కాల్‌లో చిత్ర విశేషాలను పంచుకున్నారు అనుష్క. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ మూవీ విశేషాలతో పాటు తమ జర్నీ గురించి గుర్తు చేసుకున్నారు.
స్వీటీ అని పిలవాలా.. లేక ఘాటి అని పిలవాలా?
నిన్ను స్వీటీ అని పిలవాలా? ఘాటి అని పిలవాలా? అంటూ బన్నీ ప్రశ్నించగా... 'నేను ఎప్పుడూ స్వీటీనే' అంటూ నవ్వులు పూయించారు అనుష్క. 'వేదం'లో సరోజ నుంచి రుద్రమదేవి వరకూ మన జర్నీ లాంగ్ అంటూ బన్నీ గుర్తు చేయగా... మనిద్దరం కలిసి చేసిన మూవీస్‌లో రోల్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయంటూ అనుష్క అన్నారు.
Also Read: మళ్లీ థియేటర్లలోకి విజువల్ వండర్ 'అవతార్ 2' - 3D ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేయండి... ఎప్పుడో తెలుసా?
ఎవ్వరూ కూడా 'తగ్గేదేలే'
'పుష్ప' మూవీ తర్వాత చాలామంది అదే మేనరిజం ఫాలో అవుతున్నారంటూ అనుష్క ప్రశంసించారు. చాలామంది ఇళ్లల్లో 'తగ్గేదేలే' అంటూ వాళ్ల భార్యల ముందు చేస్తున్నారని... సోషల్ మీడియాలోనూ అదే ట్రెండ్ అవుతుందని చెప్పారు. ఎవరైనా అప్ సెట్ అయితే వాళ్లు పుష్పలా మారుతున్నారంటూ నవ్వులు పూయించారు. నిన్నే అందరూ ఫాలో అవుతున్నారంటూ తెలిపారు.
మూవీ రిలీజ్ కదా నెర్వెస్ ఉందా? అంటూ బన్నీ అడగ్గా... 'చాలా నెర్వస్‌గా ఉంది' అంటూ ఆన్సర్ ఇచ్చారు అనుష్క. 'క్రిష్ గారి మూవీలో నాకెప్పుడు డిఫరెంట్ రోల్ ఉంటుంది. 'వేదం'లో సరోజ నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ మూవీలోనూ పవర్ ఫుల్ రోల్ ఇచ్చారు.' అంటూ చెప్పగా... 'ఈ జనరేషన్‌లో అంత యాక్షన్ చేసేది నువ్వే' అంటూ బన్నీ చెప్పారు.
ఆ మూవీ ఎవరు డైరెక్ట్ చేస్తారు?
ఒకవేళ పుష్ప, శీలావతి కలిస్తే ఆ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారు? అంటూ బన్నీ ఫన్ చేయగా... ఇది రెండు పార్ట్స్ చేసి చెరుకో పార్ట్ డైరెక్ట్ చేయమని చెప్దాం అంటూ ఆయన సలహా ఇచ్చారు. వీలైతే మూవీ చేద్దాం అంటూ చెప్పారు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో నీకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ఉందంటూ బన్నీ ప్రశంసించారు. మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ మూవీలో అనుష్కతో పాటు చైతన్య రావు, విక్రమ్ ప్రభు, జగపతిబాబు, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.