Anushka Sharma: బాలీవుడ్ సెలబ్రిటీల పాత ఇంటర్వ్యూల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోస్ లో ఇంట్రెస్టింగ్ క్లిప్స్ ని అభిమానులు షేర్ చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటారు. ప్రస్తుతం అనుష్క శర్మ ఓల్డ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఆమె బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నుంచి మూడు వస్తువులు  కొట్టేయాలని ప్లాన్ చేసుకున్నట్టు చెప్పారు.

వైరల్ అవుతున్న ఈ క్లిప్ వాస్తవానికి 2016 నాటిది. ఆ సమయంలో అనుష్క శర్మ, షారుఖ్ ఖాన్ చిత్రనిర్మాత సాజిద్ ఖాన్, నటుడు రితేష్ దేశ్‌ముఖ్ లతో కలిసి 'యారోన్ కి బారాత్' అనే చాట్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ అనుష్క శర్మను, "మీరు షారుఖ్ నుంచి ఒక వస్తువును దొంగిలించాల్సి వస్తే, అది ఏంటని అడిగారు. ఈ ప్రశ్నకు అనుష్క నవ్వుతూ, "ఎన్ని విషయాలు ఉన్నాయో" అని చెప్పుకొచ్చారు.  వెంటనే రియాక్టైన షారుఖ్ ఖాన్  ఇప్పటికే  "రెండు, మూడు వస్తువులు కొట్టేసిందని సరదాగా చెప్పారు.

 సాజిద్ ఖాన్ ప్రశ్నకు సమాధానంగా.. అనుష్క  షారుక్  వాచ్ లను కొట్టేయాలి అనుకున్నా అని చెప్పారు. వాటిని ఏం చేస్తారనే ప్రశ్నకు ఠక్కున...అమ్మేస్తా అని ఆన్సరిచ్చారు. ఇంకా ఏం దాచేయాలి అనుకుంటున్నారని అడిగితే...  "మన్నత్ " అని చెప్పారు అనుష్క శర్మ.

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అనుష్క శర్మ (Anushka Sharma) కలిసి నటించిన సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరి కెమిస్ట్రీకి ఫుల్ మార్క్స్ వేశారు ప్రేక్షకులు.

అనుష్క శర్మ కెరీర్ ఆరంభించిందే షారుక్ మూవీ రబ్ నే బనాది జోడీ (Rab Ne Bana Di Jodi)తో .

షారుక్ - అనుష్క కలసి 5 సినిమాల్లో నటించారు. జబ్ తక్ హై జాన్ (Jab Tak Hai Jaan), ఏ దిల్ హై ముశ్కిల్ (Ae Dil Hai Mushkil), జబ్ హ్యారీ మెట్ సెజల్ (Jab Harry Met Sejal), జీరో (Zero).

2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు బ్రేక్ తీసుకున్నారు అనుష్క శర్మ. ఇప్పుడు జంటకు ఇద్దరు పిల్లలు.. వామికా, అకాయ్. ప్రస్తుతం అనుష్క శర్మ  హీరోయిన్ గా కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయలేదు కానీ... ప్రొడ్యూసర్‌గా, బ్రాండ్ ఎండోర్సర్‌గా బిజీగా ఉన్నారు.

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అనుష్క శర్మ (Anushka Sharma)  జంటను మళ్లీ తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లై, తల్లైన హీరోయిన్స్ అంతా ...మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నా కానీ కెరీర్లో మళ్లీ బిజీ అవుతున్నారు. మరి అనుష్క శర్మ కూడా  హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తుందా? అభిమానుల ఆశ నెరవేరుతుందా? వెయిట్ అండ్ సీ