Anurag Kulkarni - Yemo Yemo : అనురాగ్ కులకర్ణి పాడిన 'ఏమో ఏమో' - దీన్నే ప్రేమంటారేమో!?

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'. 'ఏమో ఏమో' అంటూ సాగే ఈ సినిమాలో గీతాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ విడుదల చేశారు.

Continues below advertisement

Yendira Ee Panchayithi Movie : ప్రేమ కథలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అందుకు ఉదాహరణలగా బోలెడు ఉన్నాయి. తరాలు మారినా తరగని ఆదరణ ప్రేమ కథలకు మాత్రమే సొంతం. అందులోనూ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ప్రేమ కథా చిత్రాలు (village based love stories) ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంటాయి. ఇప్పుడు తెలుగులో యాక్షన్ బేస్డ్ సినిమాలతో పాటు ప్రేమ కథలు ఎక్కువగా వస్తున్నాయి. నూతన తారలతో గ్రామీణ నేపథ్యంలో ఓ కొత్త సినిమా వస్తోంది. 

Continues below advertisement

భరత్, విషికా లక్ష్మణ్‌ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్ కుమార్. ఎం  నిర్మిస్తున్న సినిమా 'ఏందిరా ఈ పంచాయితీ'. దీంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల సినిమా టైటిల్ లోగో, వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఇప్పుడు సినిమాలో తొలి పాట 'ఏమో ఏమో' (Yemo Yemo Lyrical Video)ను విడుదల చేశారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ చేతుల మీదుగా ఈ పాట విడుదలైంది. 

అనురాగ్ కులకర్ణి పాడిన 'ఏమో ఏమో'
'ఏందిరా ఈ పంచాయితీ'లో హీరో హీరోయిన్లు కొత్త కావచ్చు. కానీ, ఈ పాట పాడినది మాత్రం కొత్త గాయకుడు కాదు. 'కేరాఫ్ కంచరపాలెం'లో 'ఆశా పాశం' నుంచి 'ఇస్మార్ట్ శంకర్' టైటిల్ సాంగ్, 'శ్యామ్ సింగ రాయ్'లో 'ప్రణవాలయ...'తో పాటు 'గడ్డలకొండ గణేష్'లో 'గగన వీధిలో' వరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) 'ఏమో ఏమో...' పాటను ఆలపించారు.  

Also Read : ప్రభాస్ అభిమానులకు షాక్ - 'సలార్'ను ఎందుకు వాయిదా వేస్తున్నారు? అసలు కారణం ఏమిటి?

'ఏమో ఏమో...' పాటకు పీఆర్ (పెద్దపల్లి రోహిత్) స్వరాన్ని సమకూర్చడంతో పాటు సాహిత్యం కూడా అందించారు. అనురాగ్ కులకర్ణితో పాటు అపర్ణా నందన్ ఆలపించారు. ఈ పాట వినసొంపుగా ఉంది.

'ఏమో ఏమో' పాటను విడుదల చేసిన అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ  ''గ్రామీణ వాతావరణంలో పాటను చక్కగా చిత్రీకరించారు. హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళు అయినా సరే చక్కగా నటించారు. వాళ్ళ జంట బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి నిర్మాతలకు భారీ లాభాలను తీసుకు రావాలి. పల్లెటూరి ప్రేమ కథను దర్శకుడు సహజంగా తెరకెక్కించి ఉంటారని ఆశిస్తున్నా'' అని చెప్పారు. 

Also Read 'సలార్' కాదు - ఆ రోజు ఎన్టీఆర్ బావమరిది నితిన్ 'మ్యాడ్'!

భరత్, విషికా లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న 'ఏందిరా ఈ పంచాయితీ' చిత్రంలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, 'చిత్తూరు కుర్రాడు' తేజ ప్రధాన తారాగణం. ఇంకా ఈ చిత్రానికి కూర్పు :  జేపీ, మాటలు : వెంకట్ పాల్వాయి - ప్రియాంక ఎరుకల, ఛాయాగ్రహణం : సతీష్‌ మాసం, సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్), నిర్మాణ సంస్థ : ప్రభాత్ క్రియేషన్స్, నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం, దర్శకత్వం : గంగాధర. టి. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement