Anupama Parameswaran: లిల్లీ కెరీర్‌ను గాడిలో పెట్టిన టిల్లు!

Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్.. వరుస చిత్రాలను ప్రకటిస్తూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.

Continues below advertisement

Anupama Parameswaran: 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసిన అందాల భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.. 'అ ఆ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. 'ప్రేమమ్' రీమేక్, 'శతమానం భవతి' సినిమాలతో మంచి విజయాలు అందుకుంది. అప్పటి నుంచి కెరీర్ లో ఎక్కడా బ్రేక్ రాకుండా, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది. అయితే హిట్ సినిమాల్లో నటించినా ఎందుకనో 'స్టార్ హీరోయిన్'గా మారలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ట్రాక్ మార్చి గ్లామర్ రోల్స్, బోల్డ్ క్యారెక్టర్లతో అలరిస్తోంది.

Continues below advertisement

రీసెంట్ గా 'టిల్లు స్క్వేర్' మూవీతో అనుపమ పరమేశ్వరన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. రూ. 125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న లిల్లీ అనే బోల్డ్ క్యారక్టర్ లో ఆకట్టుకుంది అనూ. సిద్ధూతో కలిసి రెచ్చిపోయి లిప్ లాక్స్ సీన్స్ చేసింది. ఈ సినిమా సక్సెస్ తో అమ్మడి కెరీర్ మరింత జోరందుకుంది. బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

అనుపమ పరమేశ్వరన్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయి.. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. 'హను-మాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'ఆక్టోపస్' చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే 'పరదా' అనే ఫైనల్ ఓరియెంటెడ్ మూవీని అనౌన్స్ చేసింది. 'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, డైరెక్టర్ మారి సెల్వరాజ్ కాంబోలో రూపొందనున్న 'బైసన్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పా. రంజిత్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.

 

లైకా ప్రొడక్షన్ లో అనుపమ ప్రధాన పాత్రలో 'లాక్ డౌన్' అనే లేడీ ఓరియంటెడ్ సినిమా రాబోతోంది. ఏఆర్ జీవా దర్శకత్వం వహించనున్న ఈ మూవీని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఆమె బాధతో బిగ్గరగా అరుస్తున్నట్లుగా కనిపించింది. వీరితో పాటుగా 'జె. ఎస్. కె' (JSK - Truth Shall Always Prevail) అనే మలయాళ మూవీ చేస్తోంది. దీంట్లో సీనియర్ నటుడు సురేష్ గోపీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇలా అనూ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇవన్నీ కూడా వేటికవే ప్రత్యేకమైన చిత్రాలు గమనార్హం. వీటితో ఆమె ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో వేచి చూడాలి.

ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ గతేడాది ఒక్క సినిమాలో కూడా కనిపించ లేదు. ఈ ఏడాదిలో మాత్రం ఇప్పటికే మూడు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించింది. మాస్ మహారాజా రవితేజతో చేసిన 'ఈగల్' మూవీ.. తమిళ్ లో 'జయం రవి' సరసన నటించిన 'సైరన్ 108' ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఇదే క్రమంలో వచ్చిన 'టిల్లు స్క్వేర్' ఘన విజయాన్ని అందించింది. దీంతో రెండు రూ.100 కోట్ల చిత్రాల్లో భాగమైన హీరోయిన్ల జాబితాలో అనుపమ చేరింది. ఇంతకముందు నిఖిల్ సిద్ధార్థతో కలిసి ఆమె నటించిన 'కార్తికేయ 2' చిత్రం రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

Also Read: బెల్లంకొండకి జోడీగా ‘డెవిల్’ బ్యూటీ - కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన కేరళ కుట్టి!

Continues below advertisement