Paradha Movie Teaser: అనుపమ పరమేశ్వరన్ అనగానే మొన్నటి వరకు చాలా పద్దతిగా.. పక్కింటి అమ్మాయిలా కనిపించి అందరి మనసూ దోచేసింది. కానీ ఈ మధ్య ‘రౌడీ బాయ్స్’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలలో తనలోని రెండో యాంగిల్‌ని పరిచయం చేసింది. లిప్‌లాక్స్, ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోతూ అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రతో ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేందుకు ‘పరదా’తో రాబోతోంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్‌ని బుధవారం దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఎలా ఉందంటే..
‘చ్చా.. పిచ్చి గిచ్చి పట్టిందా ఆ అమ్మాయికి.. అక్కడెక్కడో చావడానికి రూ. 70 లక్షలు ఇస్తుందట’ అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్.. సినిమాలోని చాలా విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా ఇదొక మూఢనమ్మకాలకు సంబంధించిన సినిమా అని, సతీసహగమనం వంటి రోజుల నాటి సినిమా అనే క్లారిటీని ఇచ్చేసింది. సినిమాలో అనుపమ ముఖానికి పరదా వేసుకోవడానికి కూడా ఓ కారణం ఉందనేది టీజర్ ఆద్యంతం తెలియజేస్తుంది. ‘నాకొక లాజిక్ అర్థం కావడం లేదు.. పరదాతోనే కవర్ చేసుకోవాలా? హెల్మెట్ లాంటివి వాడకూడదా?’ అనే డైలాగ్‌తో చిన్న కామెడీ టచ్ ఇచ్చినా.., ‘సుబ్బు ఎక్కడున్నావ్ సుబ్బు.. నాకేదో భయంగా ఉంది.. వెళ్లిన పని పూర్తి చేసుకుని వచ్చెసెయ్ సుబ్బు..’ అనే డైలాగ్, టీజర్‌లో చూపించిన శ్రీశ్రీ జ్వాలంబికాదేవి దివ్యజ్యోతి, అమ్మవారి విగ్రహం అన్నీ కూడా ఇదొక మిస్టీరియస్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చే సినిమా అని తెలియజేస్తున్నాయి.
టీజర్ నడిచేకొద్ది.. ఒక గ్రామంలోని పాత ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలను రివీల్ చేస్తూనే.. వాటిలో మహిళలు ముఖాలకు పరదాలు కప్పుకుని ఉండటం, మహిళ బతికి ఉండగానే చనిపోవడానికి వెళుతుండటం, మధ్యలో గంభీరమైన అమ్మవారి విగ్రహం, ఆ గ్రామ ఆచారాలను సీరియస్ మోడ్‌లో చూపించి.. చివర్లో అనుపమ పరమేశ్వరన్ ముఖాన్ని రివీల్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ రూరల్ అమ్మాయి పాత్రలో కనిపించి, తన నటనతో ఆకట్టుకుంది. సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా తెరకెక్కినట్లుగా ప్రతి ఫ్రేమ్ తెలియజేస్తుంది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లు నాని, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాను తలపించినా.. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన మొదటి సినిమా ‘సినిమా బండి’లానే మరో యూనిక్ ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనేది ఈ టీజర్‌లో అర్థమవుతోంది. అనుపమతో పాటు మిగతా కనిపించిన పాత్రలన్నీ కూడా సహజంగా అనిపించడం విశేషం.
‘ఫ్యామిలీ మ్యాన్ సిరీస్’తో పాపులరైన రాజ్, డికె మద్దతుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. చిత్ర టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ టీజర్ ప్లే చేసినప్పుడు నా పదేళ్ళ జర్నీ కనిపించింది. చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఈ రోజు ఆనందంతో పాటు ఒక బాధ్యత కనిపిస్తోంది. ప్రేక్షకులను అలరించడానికి ఇలాంటి మంచి పాత్రలు మరిన్ని చేయాలనే రెస్పాన్స్‌బులిటీ. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అవుతుంది. ఈ పదేళ్ళలో నా మోస్ట్ ఫేవరేట్ ఫిలిం ‘పరదా’.. మోస్ట్ ఫేవరేట్ క్యారెక్టర్ సుబ్బు. అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. నన్ను నమ్మి, నాకీ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలని అన్నారు.
Also Read: పాపం రష్మిక... కుంటి కాలుతో ఎయిర్ పోర్టులో ఎన్ని కష్టాలు పడిందో ఈ ఫోటోల్లో చూడండి