అఖిల్ అక్కినేని 'లెనిన్'తో జూలైలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ గ్రాండ్ సక్సెస్ అందుకుంది. ఆగస్టులో చిన్న సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎపిక్ స్టూడియోస్ సంస్థతో కలిసి 'పళ్ళబురుసు' నిర్మించింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఆగస్టు 14న 'పళ్ళబురుసు' విడుదలPallaburusu First Look Released, Know Release Date: ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా 'పళ్ళబురుసు'ను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థలు అనౌన్స్ చేశాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మన తెలుగు సంస్కృతి, నేటివిటీని ప్రతిబింబించేలా కామెడీ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది.
'పళ్ళబురుసు'లో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీ కొడుకులుగా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మచా ఇతర కీలక తారాగణం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే... జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్ బ్రష్‌ను త్రాసులా చూపించారు. దానిపై తండ్రీ కొడుకులు చెరో వైపు కూర్చున్నారు. ఆ కహానీ ఏమిటో తెలియాలంటే ఆగస్టు 14 వరకు ఎదురు చూడాలి.
'పళ్ళబురుసు' చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని (ఎపిక్ స్టూడియోస్) నిర్మాతలు. ఇంకా ఛాయాగ్రహణం: వినోద్ కె బంగారి, సంగీతం: పవన్ సీహెచ్, కూర్పు: సృజన అడుసుమిల్లి, ప్రొడక్షన్ డిజైనర్: క్షితిజ్ జీవన్ రణధీర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆనంద్ రెడ్డి కర్నాటి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: అధిప్ అయ్యర్, సాహిత్యం: సురేష్ గంగుల.
