అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లలోకి వెళితే కాసేపు హాయిగా నవ్వుకుని బయటకు రావచ్చు. నవ్వించడంలోనే కాదు... తనకు తెలిసిన వాళ్ళు బాధలో ఉన్నా సరే సాయం చేయడంలో ముందుంటారు అనిల్ రావిపూడి. బుల్లితెర సాక్షిగా మరోసారి ఆయన మంచి మనసు బయట పడింది. 'సుడిగాలి' సుధీర్ చెప్పడం వల్ల అందరికీ తెలిసింది.

Continues below advertisement

'డ్రామా జూనియర్స్ 9'లో చిన్నారికి సాయం!దర్శకుడిగా అనిల్ రావిపూడి వెరీ బిజీ. ఓ వైపు సినిమా షూటింగ్స్ చేస్తూ... మరో వైపు టీవీ షోలలో సందడి చేస్తున్నారు. 'జీ తెలుగు'లో ప్రసారం అవుతున్న 'డ్రామా జూనియర్స్' సీజన్ 9 (Drama Juniors Season 9) షోలో అనిల్ రావిపూడి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read: Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్

Continues below advertisement

'డ్రామా జూనియర్స్' సీజన్ 9లో చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తున్న ఓ చిన్నారి తల్లికి యాక్సిడెంట్ అయ్యింది. అది అనిల్ రావిపూడికి తెలిసింది. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చులను ఆయన చెల్లించారు. హాస్పిటల్‌లో ఉన్న ఆ చిన్నారి తల్లి ఫోటోలతో పాటు, ఇంటికి డిశ్చార్జ్ అయ్యాక బ్యాండేజ్ కాలితో అనిల్ రావిపూడికి ఆ తల్లి థాంక్స్ చెబుతున్న ఫోటో, వీడియోలను షోలో చూపించారు.

చిన్నారి కంటతడి... తమ్ముడిని ఉన్నానంటూ!అనిల్ రావిపూడి సాయం గురించి సుధీర్ రివీల్ చేయడానికి ముందు స్టేజిపై ఆ చిన్నారి ఓ స్కిట్ చేసింది. అందులో అనిల్ రావిపూడిని 'తమ్ముడూ' అంటూ ఎంతో ప్రేమగా పిలిచింది. అది చూసి సుధీర్ ఫ్రస్ట్రేట్ కావడం వంటివి ప్రోమోలో హైలైట్ అయ్యాయి. ఆయన సాయం గురించి సుధీర్ వెల్లడించిన తర్వాత... ఆ చిన్నారి కంటతడి పెట్టుకుంది. చిత్రీకరణకు తన తల్లి రాలేదని ఎమోషనల్ అయ్యింది. అప్పుడు అనిల్ రావిపూడి ''తమ్ముడూ...' అని పిల్చావ్ కదా. అమ్మ లేకపోతే నేను ఉన్నాను కదా'' అని చెప్పారు. 

Also Read: Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?

'డ్రామా జూనియర్స్ 9'లో అఖిల్, భాగ్యశ్రీ సందడి!ప్రతి శని, ఆది వారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు 'డ్రామా జూనియర్స్ 9' ప్రసారం అవుతోంది. ఈ వారం ఎపిసోడ్‌లో 'లెనిన్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో హీరోయిన్లు అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే సందడి చేయనున్నారు. వాళ్ళిద్దరినీ ప్రోమోలో చూపించారు. 

అనిల్ రావిపూడితో పాటు సీనియర్ హీరోయిన్, పొలిటీషియన్ రోజా, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ జడ్జీలుగా సందడి చేస్తున్నారు. ధన్యా బాలకృష్ణ సైతం ఈ షోలో సందడి చేస్తున్నారు. బుల్లితెరపై ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.

Also Read: The Odyssey Review - 'ది ఒడిస్సీ' రివ్యూ: క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఎలా ఉందంటే?