Annapurna Photo Studio: చైతన్యరావు, లావణ్య జంటగా నటించిన 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' టీజర్‌ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రేకెత్తించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను కూడా మేకర్స్ ఆవిష్కరించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.


'అన్నపూర్ణ ఫొటో స్టూడియా' స్టోరీ 90ల నాటి సన్నివేశాలను చూపించబోతోంది. ప్రత్యేకమైన శైలిలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సుందరమైన గోదావరి ప్రాంతంలో జరిగే ఓ జంట ప్రేమకథను చూపించనుంది. ఇది ఒక మాయా ప్రేమకథ. మంత్రముగ్ధులను చేసే సంగీతం, డ్రామా, యాక్షన్.. అన్నీ ప్రత్యేకమైన పద్ధతిలో ప్రేక్షకులను అలరించనున్నాయి.


ఇక తాజాగా రిలీజైన ఈ ట్రైలర్‌లోని విజువల్స్ సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి, గోదావరి సెట్టింగ్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఈ లవ్ డ్రామాలో పీరియడ్ సెట్టింగ్‌ని చేర్చడం అనేది విలక్షణమైన ఎలిమెంట్‌ను జోడిస్తుంది. లెజెండరీ యాక్టర్ ANRకి వీరాభిమాని అయిన కథానాయకుడు ఫొటో స్టూడియో నడుపుతుంటాడు. ఆ సమయంలో అతని జీవితంలోకి ఓ అమ్మాయి వస్తుంది. అప్పుడే అతని జీవితంలోనూ పలు మార్పులు చోటుచేసుకుంటాయి. అతని జీవితంలో జరిగే మార్పులేంటీ.. అవి కథను ఎక్కడి వరకు తీసుకెళ్తాయి అన్న విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక సినిమాలోని కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ మూవీ జూలై 21న థియేటర్లలో రిలీజ్ కానుంది.






'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' ట్రైలర్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అన్నారు. ఈ సినిమాలో కామెడీ, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ డ్రామా ఇలా అన్నీ ఉన్నాయని చెప్పాడు. ఇక 80, 90ల నేపథ్యాన్ని ఎంచుకోవడంతో ఓ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందన్న ఆయన.. అప్పటి వాతావరణాన్ని చక్కగా క్రియేట్ చేశారని చెప్పారు. ఇక సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ కూడా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపారు.


'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' రొమాన్స్, మిస్టరీ, కామెడీ, డ్రామా సమ్మేళనంగా రూపొందించారు. ఈ సినిమాను యష్ రంగినేని నిర్మించగా, ఓ పిట్ట కథ ఫేమ్ చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ప్రిన్స్ హెన్రీ సంగీతం సమకూర్చగా, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో యష్ రంగినేని, వాసు ఇంటూరి, ఉత్తరారెడ్డి, మిహిరా, వైవా రాఘవ్, లలిత్ ఆదిత్య, కృష్ణ మోహన్, రమణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Read Also : Adipurush Row: ‘ఆదిపురుష్’ మేకర్స్‌‌కు కొత్త తలనొప్పి, విచారణకు హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశం


Join Us on Telegram: https://t.me/abpdesamofficial