Rangabali: ‘రంగబలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ సుమకు ఊహించని షాకిచ్చిన నాగశౌర్య

డైరెక్టర్‌ పవన్‌ బసంశెట్టి దర్శకత్వంలో జూలై 7న రిలీజ్ కానున్న 'రంగబలి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. మూవీ టీం అంతా కలిసి ఈవెంట్ కు యాంకర్ సుమే స్పెషల్ గెస్ట్ అని పొగిడారు.

Continues below advertisement

Rangabali Pre Release Event: నాగ శౌర్య నటించిన 'రంగబలి' జూలై 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన రంగబలి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగశౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్నో సినిమాలు విజయం సాధించాలని, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆశీర్వదించే యాంకర్ సుమనే స్పెషల్ గెస్ట్ అని ఆయన చెప్పడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె కన్నా స్పెషల్ గెస్ట్ ఇంకెవరుంటారంటూ సుమపై నాగశౌర్య పొగడ్తల వర్షం కురిపించారు.

Continues below advertisement

"ఎన్నో సినిమాల మంచి కోరి, పెద్ద స్టార్ నుంచి చిన్న స్టార్ల వరకు అందరి సినిమాల క్షేమాన్ని కోరి, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ, ప్రతీ సినిమా క్లిక్ కావాలి. ప్రతీ సినిమా ప్రొడ్యూసర్ బాగుండాలి, హీరోహీరోయిన్లతో పాటు ఇతర నటీనటులు బాగుండాలని కోరుకునే సుమ గారంతంటి చీఫ్ గెస్ట్ ఇంకెవరూ ఉండరు. నిజం చెప్తున్నాను. ఈ రోజు మాకు చీఫ్ గెస్ట్ మాకు సుమ గారే. ఆవిడ కేవలం మాటలతోనే అందరికీ సంతోషాన్ని పంచుతుంది. చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలవాలని చూస్తున్నపుడు పవన్ మేమంతా కలిసి సుమ గారైతే బాగుంటుందని డిసైడ్ చేశాం. ఆమె ఆశీర్వాదాలు మాకు కావాలి" అని శౌర్య వ్యాఖ్యానించారు. 

సుమా మాట్లాడుతూ.. ‘‘ఇది నిజంగా కలో, నిజమో తెలియడం లేదు. ఇప్పటివరకు నేను ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నీ కలిపి 300కు పైగా చేశాను. ఒక్కరు కూడా నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవలేదు. ఫస్ట్ టైం పిలిచారని సుమ చెప్పారు. రేపట్నుంచి అందరూ ఇలా తనను చీఫ్ గెస్ట్ గా పిలవాలని కోరితే.. నా పొట్టగతేంట"ని ఆమె చమత్కరించారు. ఒక గెస్ట్ హోదాలో మాట్లాడుతున్నానన్న ఆమె.. "ఇలాంటి ఒక కమర్షియల్ సబ్జెక్ట్.. ఎంటర్టైన్ మెంట్ సినిమా.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఎలాంటి సందేహం లేకుండా చెప్పగలిగిన సినిమాకు తనను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు" అని చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. చీఫ్ గెస్ట్ అన్న విషయం చీఫ్ గెస్ట్ కు కూడా తెలియలేదు అంటూ ఈవెంట్ లో నవ్వులు పూయించారు. శౌర్య చేసిన దాదాపు అన్ని సినిమాలకు తాను ఈవెంట్ లో యాంకరింగ్ చేశానన్నారు. అతను రోజురోజుకూ ఎంత డెవలప్ అవుతున్నాడో చూస్తున్నానని, శౌర్య చాలా కష్టపడతాడడని సుమ కొనియాడారు. ఇక మూవీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పిన సుమ.. చివరగా ఓ ప్రశ్న వేశారు. 'బాహుబలి'కి 'రంగబలి'కి సంబంధం ఏంటీ అని అడిగారు. దానికి డైరెక్టర్‌ పవన్‌ బసంశెట్టి చెప్పిన సమాధానం అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసింది. 'బాహుబలి' బ్లాక్ బస్టరే.. 'రంగబలి' కూడా బ్లాక్ బస్టరే అవుతుందని ఆయన చెప్పిన ఆన్సర్ అందర్నీ ఆకట్టుకుంది. 

ఇక 'రంగబలి' మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో లవ్‌ ట్రాక్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమా వినోదాత్మకంగా సాగనున్నట్టు డైరెక్టర్‌ పవన్‌ బసంశెట్టి ఇంతకుమునుపే వెల్లడించారు. రంగబలి చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆర్ శరత్‌కుమార్‌, సప్తగిరి, గోపరాజు రమణ, కల్యాణి నటరాజన్‌, శుభలేఖ సుధాకర్‌, మురళీ శర్మ, సప్తిగిరి, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, భద్రం, శివనారాయణ, పీకే, పవన్, నోయెల్‌, రమేశ్ రెడ్డి, హరీష్‌ చంద్ర, బ్రహ్మాస్త్రి, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. నాగశౌర్య నెక్స్ట్ 'నారి నారి నడుమ మురారి', 'పోలీస్‌ వారి హెచ్చరిక' సినిమాల్లో నటించనున్నారు.

Read Also : Reba Monica John: అనూ ఇమ్మాన్యుయేల్‌‌కు, రెబా జాన్‌ ఏమవుతుంది? ‘సామాజవరగమన‘ బ్యూటీ క్లారిటీ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement