Anna Ben: ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లో కైరా పాత్ర ఉంటుందా? నాగ్ అశ్విన్ రెస్పాన్స్! ఆన్నా బెన్ సమాధానం ఏంటంటే?

Kalki 2898 AD Actress Anna Ben: మలయాళంలో హీరోయిన్‌గా ప్రేక్షకులకు దగ్గరయిన ఆన్నా బెన్.. ‘కల్కి 2898 ఏడీ’లో కైరా అనే పాత్రతో తెలుగువారిని పలకరించింది. ఇక సీక్వెల్‌లో ఈ పాత్రపై క్లారిటీ ఇచ్చింది.

Continues below advertisement

Anna Ben About Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ కోసం దేశవ్యాప్తంగా ఉన్న నటీనటులను రంగంలోకి దించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కోలీవుడ్ నుండి కమల్ హాసన్, శోభన లాంటి సీనియర్ ఆర్టిస్టులను ఈ సినిమాలో భాగం చేశాడు. కేవలం సీనియర్ యాక్టర్లు మాత్రమే కాకుండా ఈ మూవీలో పలువురు యంగ్ నటీనటులు కూడా ఉన్నారు. అందులో ఆన్నా బెన్ ఒకరు. మలయాళంలో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆన్నా.. ‘కల్కి 2898 ఏడీ’లో కైరా అనే పాత్రలో నటించింది. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ భామ.

Continues below advertisement

చాలామంది ఫ్రెండ్స్..

‘కల్కి 2898 ఏడీ’లో ఆన్నా బెన్ చేసిన కైరా అనే పాత్ర మధ్యలోనే చనిపోతుంది అన్నట్టుగా దర్శకుడు నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చాడు. కానీ తనకు ఈ మూవీ సీక్వెల్‌లో కూడా నటించాలని ఉందని నాగ్ అశ్విన్‌తో చెప్పిందట ఆన్నా. దానికి దర్శకుడి రెస్పాన్స్ ఎలా ఉందో తాజాగా బయటపెట్టింది. ‘‘నాకు కూడా కైరా పాత్ర సీక్వెల్‌లో ఉంటుందా లేదా అనే డౌట్ ఉంది. కల్కి 2898 ఏడీ షూటింగ్ సమయంలో నేను చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లకు ఫ్రెండ్ అయ్యాను. వాళ్లు కూడా నా క్యారెక్టర్ గురించి మరింత తెలుసుకోవడానికి ట్రై చేశారు. మళ్లీ సినిమాలో నా పాత్ర తిరిగొస్తే బాగుండేదని ఆశిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చింది ఆన్నా బెన్.

ఎక్కువ మాట్లాడరు..

ఇదే విషయంపై నాగ్ అశ్విన్ రెస్పాన్స్ గురించి చెప్తూ.. ‘‘నేను కైరా పాత్ర గురించి నాగ్ అశ్విన్‌ను అడిగాను. కానీ ఆయన ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఎక్కువగా మాట్లాడరు. నేను అడిగినదానికి నవ్వుతూ నాకు కూడా తెలియదు, చూద్దాం అన్నారు. ఒకవేళ కైరా తిరిగొస్తే నేను కూడా చాలా హ్యాపీ’’ అని తెలిపింది ఆన్నా బెన్. ఇక ‘కల్కి 2898 ఏడీ’లో మరో మలయాళం స్టార్ అయిన దుల్కర్ సల్మాన్ కూడా ఒక క్యామియో చేశాడు. ఈ విషయంలో ఆన్నా స్పందిస్తూ.. ‘‘దుల్కర్ సల్మాన్ ఉన్న ఇండస్ట్రీలో నేను కూడా ఉండడం నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. కల్కి 2898 ఏడీ మూవీ మలయాళ సినీ ఇండస్ట్రీకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది’’ అని చెప్పుకొచ్చింది.

ఫోన్లు చేస్తున్నారు..

‘‘దుల్కర్ సల్మాన్ ఇప్పుడు కేవలం మలయాళం స్టార్ మాత్రమే కాదు. నేషనల్ స్టార్ కూడా. ఆయనకు ఇక్కడ చాలా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆయన కల్కి 2898 ఏడీలో భాగమవ్వడం చాలా విషయాల్లో మార్పులు తీసుకొచ్చింది. మలయాళ ఇండస్ట్రీ తరపున వచ్చి ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో నేను, శోభన మేడమ్ భాగమయినందుకు అక్కడ నా కో యాక్టర్స్ అంతా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. కాసేపే అయినా ఇలాంటి సినిమాలో కనిపించినందుకు చాలామంది నాకు కాల్ చేసి విషెస్ చెబుతూ సినిమాపై హర్షం వ్యక్తం చేశారు. నాకు ఈ సినిమా వల్ల చాలా ప్రేమ లభించింది. ఇందులో భాగమయిన నటీనటుల్లో నా పేరు కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తన సంతోషాన్ని షేర్ చేసుకుంది ఆన్నా బెన్.

Also Read: ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా బిడ్డ, ఆ సీన్ చేస్తున్నప్పుడు రణవీర్ అక్కడే ఉన్నాడు - నాగ్ అశ్విన్

Continues below advertisement
Sponsored Links by Taboola