Sonakshi Sinha Reacts on her Pregnancy Rumours: సోనాక్షి సిన్హా ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, మూవీ రైటర్‌ జహీర్ ఇక్బాల్‌ని పెద్దల సమక్షంలో వైవాహిక (Sonakshi Sinha Wedding) బంధంలోకి అడుగుపెట్టింది. జూన్‌ 23న జహీర్‌తో ఏడడుగులు వేసింది. ఇటీవల ఈ కొత్త జంట హనీమూన్‌కి కూడా వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. అయితే పెళ్లయిన వారంలో రోజులకే సోనాక్షి ఆస్పత్రిలో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. దీంతో అంతా షాక్‌ అయ్యారు. 


అప్పుడే ప్రెగ్నెంటా?


Sonakshi Sinha Funny Comments on Pregnancy Rumour: అప్పుడే ప్రెగ్నెంటా? పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చిందా? అని అందరిలో రకరకాల సందేహాలు మొదలయ్యాయి. అయితే తర్వాత ఆమె హస్పిటల్‌కు ఎందుకు వెళ్లిందో క్లారిటీ కూడా వచ్చింది. ఈ రూమర్స్‌ నడమ సోనాక్షి-ఇక్బాల్‌లు హనీమూన్‌కి కూడా వెళ్లొచ్చారు. ఇక ప్రస్తుతం సోనాక్షి తన నెక్ట్స్‌ మూవీ కుకుడ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై ప్రశ్న ఎదురైంది. ఇటీవల మీరు ఆస్పత్రిలో కనిపించిన వీడియో వైరల్‌ అయ్యింది. అది చూసి అంతా మీరు గర్భవతి అని డిసైడ్‌ అయ్యారు.


ఇప్పట్లో ఆస్పత్రికి వెళ్లను..


దానిపై మీ స్పందన ఏంటని హోస్ట్‌ ప్రశ్నించారు. దీనికి సోనాక్షి మాట్లాడుతూ.. "ఇక నేను ఇప్పట్లో అసలు ఆస్పత్రికి వెళ్లను. ఎందుకంటే మీరు వెంటనే గర్భవతి అని డిసైడ్‌ చేసేస్తారు" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి తర్వాత ఇక్బాల్‌తో తన జీవితం ఎలా ఉందని అడగ్గా.. తన లైఫ్‌ పెళ్లికి ముందు సంతోషంగానే ఉందని.. పెళ్లి తర్వాత మరింత ఆనందంగా ఉన్నానని సోనాక్షి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కాగా సోనాక్షి ఆస్పత్రికి వెళ్లడానికి అసలు కారణం ఆమె తండ్రి ఎంపీ శత్రుఘ్న సిన్హా. ఆయన ఆస్పత్రిలో జాయిన్ అవ్వడంతో తండ్రిని పలకరించేందుకు సోనాక్షి ఆస్పత్రికి వెళ్లింది.


ఏడేళ్ల ప్రేమ


రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగానే తాను హాస్పిటల్‌లో చేరానని డిశ్చార్జ్‌ అనంతరం శత్రఘ్న సిన్హా మీడియాతో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా సోనాక్షి సిన్హా, జహీర్‌ ఇక్బాల్‌ ఏడేళ్ల సుదీర్ఘ రిలేషన్‌ అనంతరం జూన్‌ 23న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారిది ఏడేళ్ల రిలేషన్‌ అని పెళ్లి అనంతరం సోనాక్షి సోషల్‌ మీడియాలో వెల్లడించింది. "సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు(23.06.2017) మా ప్రేమకు చిగురించింది. ఒకరి కళ్లల్లో ఒకరం నిజమైన ప్రేమను గ్రహించాం. మేమిద్దరం ఎప్పటికి ఒక్కటేనని అప్పుడే స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యాం. ఒకరి చేయి ఒకరం పట్టుకుని సవాళ్లను ఎదుర్కొన్నాం. మా ప్రేమ బంధాన్ని నిలబెట్టుకున్నాం" అంటూ ఎమోషనల్‌ అయ్యింది. 


Also Read: హీరో రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్‌ - అతడి ప్రియురాలు లావణ్యకు నోటీసులు జారీ..