Notice to Raj Tarun Girlfriend Lavanya: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కేసులో పోలీసులు అతడి ప్రియురాలు లావణ్యకు షాకిచ్చారు. ఈ కేసు విషయంలో తిరిగి ఆమెకు నోటీసులు ఇచ్చి ట్విస్ట్ ఇచ్చారు. కాగా రాజ్ తరుణ్‌పై అతడి ప్రియురాలు లావణ్య చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని కోకాపేటకు చెందిన లావణ్య నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసింది. పదకొండేళ్లుగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నామని, సీక్రెట్‌గా గుడిలో పెళ్లి చేసుకున్నామంటూ సంచలన విషయాలు చెప్పింది. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని తనని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఆరోపించింది.
లావణ్యకు నోటీసులు
యువతి ఫిర్యాదుతో శుక్రవారం(జూన్ 5) మధ్యాహ్నం నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో రాజ్ తరుణ్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. లావణ్య ఆరోపణలపై రాజ్ తరుణ్ వెంటనే స్పందించాడు. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చి లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్ ఉందని, మస్తాన్ సాయి అనే వ్యక్తితో సహాజీవనం చేస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే ఇప్పుడు తన ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలంటూ నార్సింగ్ పోలీసులు లావణ్యకు నోటీసులు అందించినట్టు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం లావణ్య ఫిర్యాదు చేయగా.. రాజ్ తరుణ్ కామెంట్స్ అనంతరం సాయంత్ర ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. కానీ ఇప్పటి వరకు లావణ్య పోలీసుల నోటీసులపై స్పందించలేదని తెలుస్తోంది.
ఆ హీరోయిన్ ప్రేమయాణం వల్లే..
రాజ్ తరుణ్ మూడు నెలలుగా తనకు దూరంగా ఉంటున్నాడని, తన మూవీ హీరోయిన్ మల్వీ మల్హోత్రాతో ప్రేమాయాణం సాగిస్తున్నాడని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె మాయలో పడి తనని వదిలేయమని వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. అంతేకాదు వదిలేయకుంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పింది. అంతేకాదు రాజ్‌తరుణ్, మాల్వి కలిసి గోవా, చెన్నై, పాండిచ్చేరిలకు కూడా కలిసి వెళ్లారని, ఈ విషయంపై నిలదీయగా రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని పేర్కొంది. రాజ్‌తరుణ్‌ని వదిలేస్తే డబ్బు ఇస్తామని, లేదంటే చంపేస్తామని హీరోయిన్ సోదరుడు తనని బెదిరించాడని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరున, తన కుటుంబం నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పించాలని పోలీసులు లావణ్యకు సూచిస్తూ నోటీసులు జారీ చేశారు.
లావణ్యతో రిలేషన్ నిజమే..
ఇక రాజ్ తరుణ్ ప్రియురాలి ఆరోపణలపై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. లావణ్య తాను రిలేషన్‌లో ఉన్నమాట వాస్తవమే కానీ, అది ఒకప్పుడు అని చెప్పాడు. ఆమె 2011 నుంచి 2014 వరకే ఉన్నానని చెప్పాడు. ఇద్దరం కలిసి ఒకే ప్లాట్‌లో నివసించామని, కానీ తనతో ఎలాంటి శారీరక సంబంధం లేదన్నాడు. ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకి ఎప్పుడు లేదని చెప్పాడు. లావణ్యకు డ్రగ్స్, సిగరేట్, మందు తాగే అలవాట్లు ఉన్నాయని, అవి చూసే ఆమెకు దూరంగా ఉన్నానని చెప్పాడు. ఇక లావణ్య ఆరోపణలలో అసలు నిజం లేదన్నాడు. తనతో రిలేషన్‌లో ఉంటూనే మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని, అతడితో సహాజీవనం కూడా చేసిందని ఆరోపించాడు. నాపై కేసు పెట్టిటనట్టే మస్తాన్‌పై కూడా గుంటూరులో కేసు పెట్టిందంటూ సంచలన విషయాలు బయటపెట్టాడు.
Also Read: 'కల్కి 2898 AD' టికెట్ల రేట్ల పెంపు - అసలు విషయం చెప్పిన నిర్మాత అశ్వనీ దత్