Anjali Reacts On Balakrishna Controversy: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ భీభత్సమైన పబ్లిసిటీ తెచ్చింది. రీజనల్ నుంచి నేషనల్ మీడియా వరకు ఒక్కటే వీడియో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో సంగతి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అంజలిని బాలకృష్ణ అలా తోసేయడం ఏమిటని నెటిజనులు అంతా ఆడిపోసుకున్నారు. ఆయనకు మర్యాద లేదని బాలీవుడ్ డైరెక్టర్ ఒకరు కామెంట్ చేశారు. అయితే, బాలకృష్ణను ట్రోల్ చేసే జనాలు అందరికీ చెంప చెళ్ళుమనేలా అంజలి ట్వీట్ చేశారు.


థాంక్యూ బాలకృష్ణ... నవ్వులతో కూడిన వీడియో!
అంజలిని బాలకృష్ణ పక్కకు తోసిన విజువల్స్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే... ఈవెంట్ మొత్తంలో తామిద్దరం ఉన్న విజువల్స్ అంజలి ట్వీట్ చేశారు. తోసిన తర్వాత హైఫై కొట్టిన వీడియో కూడా అందులో యాడ్ చేశారు. ఇంకా ఆవిడ ఏమన్నారంటే?


''గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేసిన బాలకృష్ణ గారికి థాంక్స్. మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పరస్పర గౌరవం ఉంది. చాలా రోజుల నుంచి మా మధ్య మంచి స్నేహం ఉంది. ఆయనతో మరోసారి స్టేజి షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి'' అని అంజలి పేర్కొన్నారు.


Also Read: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆడియన్స్ రివ్యూ: 'పుష్ప'కు ఫాస్ట్ ట్రాక్ తరహాలో... ఎన్టీఆర్‌తో తీస్తే ఇంకా బాగుండేదా? జనాలు గొర్రెలు డైలాగ్ ఏంట్రా బాబూ!






అంజలి మీద సానుభూతి చూపిస్తూ, ఆవిడ తరఫున మాట్లాడుతున్నట్టు బాలకృష్ణను ట్రోల్ చేస్తున్న జనాలకు ఆవిడ చేసిన ట్వీట్ లాగిపెట్టి చెంప  మీద కొట్టినట్టు ఉందని నందమూరి అభిమానులు, కొందరు ప్రేక్షకులు పేర్కొంటున్నారు.



ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిన 'గ్యాంగ్స్...' నిర్మాత!
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' స్టేజి మీద జరిగిన విషయం గురించి ఆల్రెడీ ఆ మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. పక్కకు జరగమని క్యాజువల్‌గా తోశారని, అందులో కాంట్రావర్సీ చేయాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. ఇక బాలయ్య ఆల్కహాల్ తాగారని వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. అటువంటిది ఏమీ లేదని, అదంతా గ్రాఫిక్స్ అని ఆయన స్పష్టం చేశారు. నట సింహం అభిమానులు బాలకృష్ణ కాళ్ళ దగ్గర కేవలం వాటర్ బాటిల్ మాత్రమే ఉన్న విజువల్స్ పోస్ట్ చేశారు. దాంతో నాగ వంశీ మాటలకు మరింత బలం చేకూరింది.


Also Read: సుక్కుతో స్టెప్పులు వేయించిన డ్యాన్స్ మాస్టర్ - 'పుష్ప 2'లోని 'సూసేకి...' లిరికల్ వీడియో స్పెషాలిటీ ఏంటో తెలుసా?