అనిల్ రావిపూడి.. సక్సెస్ మెషీన్, హిట్ మెషీన్ ఇలా విజయానికి ఏ పేరు ఉంటే ఆ పేరు ఈ డైరెక్టర్ పేరు ముందు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు.. ఒకదానిని మించి ఒకటి సక్సెస్ అయ్యాయి. కళ్యాణ్ రామ్‌తో మొదలు పెట్టి.. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, మహేష్ బాబు, బాలయ్య, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలను డైరెక్ట్ చేయడమే కాకుండా.. వారికి హిట్స్ కూడా ఇచ్చి ఆయా హీరోల అభిమానులతో శభాష్ అనిపించుకున్నారు.. అనిపించుకుంటున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన వెంకీ మామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అయితే.. బిగ్గెస్ట్ హిట్‌గా దూసుకెళుతోంది. ఈ సక్సెస్‌తో హ్యాపీ మూడ్‌లో ఉన్న అనిల్ రావిపూడి.. తను ఇండస్ట్రీకి వచ్చి జనవరి 23తో 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన ఈ జర్నీలో సహకరించిన వారందరికీ థ్యాంక్స్ చెప్పేందుకు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘‘ఈ పదేళ్ళ జర్నీలో నేను చేసిన ప్రతి సినిమా ఒక ఎక్స్‌పీరియన్స్. నేను ఏ జోనర్ సినిమా కూడా.. ఆడియన్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్‌గా ఈ పొంగల్‌కి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో అద్భుతమైన విజయం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా ఆడియన్స్‌కే ఇస్తున్నాను. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు ప్రేక్షకులు మాములు సక్సెస్ ఇవ్వలేదు. ఆరు రోజుల్లో రూ. వందకోట్ల షేర్, వన్ వీక్‌లో 200 కోట్లు క్రాస్ చేయడం అంటే ఓ అద్భుతం. ఇది నా కెరీర్‌లోనే ఓ హిస్టరీ. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి ఇంకా బలం వుందని ఆడియన్స్ చాలా స్ట్రాంగ్‌గా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. ‘సంక్రాంతికి వస్తున్నాం’కు వస్తున్న కాంప్లిమెంట్స్ చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ‘మా అమ్మ ముఫ్ఫై ఏళ్ల తర్వాత సినిమాకి వచ్చింది’ అని ఓ ఫ్రెండ్ ఫోటో షేర్ చేస్తూ మెసేజ్ పెట్టాడు. కొంతమంది వీల్ ఛైర్‌లో వచ్చీ మరి సినిమా చూశారు. సినిమాకి దూరమైన ఆడియన్స్ మళ్ళీ థియేటర్‌కి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా ఈ ఫీలింగ్ చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇది ఫ్యామిలీ జోనర్‌కి వున్న బలం. ఫ్యామిలీ జోనర్ నా స్ట్రెంత్. ఈ జోనర్‌లో సినిమా చేసినప్పుడు ఇంకాస్త కాన్ఫిడెంట్‌గా అల్లరి చేస్తూ మంచిగా తీస్తాను. ఆడియన్స్ నాకు ఇచ్చిన వెపన్ ఎంటర్‌టైన్మెంట్. దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టను.
Also Read: పాపం రష్మిక... కుంటి కాలుతో ఎయిర్ పోర్టులో ఎన్ని కష్టాలు పడిందో ఈ ఫోటోల్లో చూడండి
డైరెక్టర్ కావడం నా డ్రీమ్. అది ‘పటాస్’ సినిమాతో తీరిపోయింది. ఆ తర్వాత వచ్చిందంతా బోనస్‌గా భావిస్తున్నాను. నాకు లైఫ్ ఇచ్చింది ఆడియన్స్. వారికి పైసా వసూల్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడమే నా టార్గెట్. అదే చేసుకుంటూ వస్తున్నాను. ఈ పదేళ్లలో నేను చేసిన ప్రతి సినిమా ఒక వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్ కొనసాగింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్‌గారు లేకపొతే నా కెరియర్ లేదు. ఆయన ‘పటాస్’ సినిమాను ప్రొడ్యూస్ చేసి నన్ను డైరెక్టర్‌గా నిలబెట్టారు. ఈ పదేళ్ళ క్రెడిట్ ముందు కళ్యాణ్ రామ్‌గారికి ఇస్తాను. తర్వాత సాయి ధరమ్ తేజ్ గారితో ‘సుప్రీమ్’, రవితేజగారితో ‘రాజా ది గ్రేట్’, వెంకటేష్-వరుణ్ గార్లతో ‘ఎఫ్2’, సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ‘సరిలేరు నీకెవ్వరు’, మళ్లీ వెంకీ-వరుణ్‌లతో ‘ఎఫ్3’, బాలకృష్ణ గారితో ‘భగవంత్ కేసరి’.. మళ్లీ వెంకీ గారితో ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇలా ప్రతి హీరోతో ప్రతి సినిమా ఒక మెమురబుల్ ఎక్స్‌పీరియన్స్. ఒకప్పుడు నేను సినిమాలు చూస్తూ విజిల్స్ కొట్టిన హీరోలతో కలిసి పనిచేయడం అల్టిమేట్ ఫీలింగ్.
పదేళ్ళ కెరీర్‌లో ఏం సంపాదించాను అంటే.. నా సినిమాని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ ప్రేమని. ఈ పదేళ్ళుగా నాకు వచ్చిన పెద్ద ఆస్తి అదే. దీన్ని సినిమా సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నా. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో నా ఆస్తి విలువేంటో ఆడియన్స్ మళ్ళీ తెలియజేశారు. ఆడియన్స్ ప్రేమ పరంగా నేను మల్టీ మిలీనియర్‌ని. వాస్తవానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథ రాసుకునేప్పుడు ‘ఎఫ్ 2’ లాంటి మంచి ఎంటర్‌టైనర్ తీద్దామని అనుకున్నాను. ‘ఎఫ్ 2’లా ఆడితే చాలు అనుకున్నా. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మా అంచనాలుకు మించి ఆడుతోంది. ఎనిమిదో రోజు కూడా సినిమా ఫిగర్స్, రెవెన్యూ షాకింగ్‌గా వుంది. నాకే సర్‌ప్రైజింగ్‌గా వుంది. ఫైనల్ నెంబర్ కూడా అందరూ సర్‌ప్రైజ్ అయ్యే నెంబర్ ఉండబోతోంది. ఇది వెంకటేష్‌గారికి, మా టీం అందరికీ ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప తీర్పు. దీనికి సంక్రాంతి సీజన్ 20 శాతం అడ్వాంటేజ్ ఉంటుంది. 80 శాతం మాత్రం కంటెంట్‌లో విషయం ఉండాలి. సంక్రాంతి తర్వాత కూడా ఈ సినిమా హౌస్‌ఫుల్ అవుతోంది. కాబట్టి, సీజన్ సినిమాని కాపాడుతుందని అంటే.. నేను నమ్మను. సినిమా బాగుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఆ అడ్వాంటేజ్ ప్రతి సినిమాకి ఉంటుంది. ఈ సినిమాలో కంటెంట్ పరంగా మేము కొత్తగా ఫీల్ అయింది ఒక భార్య, ఒక మాజీ ప్రేయసితో ఒక వ్యక్తి ప్రయాణం. ఈ మధ్యకాలంలో ఇలాంటి టెంప్లేట్ నేను ఎక్కడా చూడలేదు. ఇది చాలా ఫ్రెష్‌గా ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. ఆడియన్స్ కంటెంట్‌ని కొత్తగా ఫీల్ అవ్వడం వల్లే ఇంత గొప్ప జడ్జిమెంట్ వచ్చిందని భావిస్తున్నాను.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు ప్రమోషన్స్ కూడా చాలా ప్లాన్డ్‌గా చేశాం. నాతోపాటు వెంకటేష్‌గారు జాయిన్ అవ్వడం అనేది ఒక అద్భుతం. ఆయనకున్న స్టార్డమ్‌కి రీల్స్ చేయడం, స్కిట్స్ చేయడం.. ఇవన్నీ పబ్లిక్ పరిశీలించారు. దీంతో ఈ సినిమాలో ఏదో ఉంది వెళ్లి చూడాలనే ఆసక్తి ఆడియన్స్‌లో కలిగింది. సినిమాకి జెన్యూన్‌గా ఆడియన్స్ ఎంతమంది వెళ్తున్నారనేది బుక్ మై షో చూస్తే అర్థమైపోతుంది. ఈ సినిమా ఓపెనింగ్ డే నుంచే రికార్డ్ స్థాయిలో టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి. చాలా ఏరియాల్లో రికార్డ్స్ క్రియేట్ అయ్యాయని చెబుతున్నారు. ఈ సినిమా నా కెరీర్‌లో ఎయిత్ వండర్. నా సక్సెస్ సీక్రెట్ అంటే.. థియేటర్స్‌లో ఆడియన్స్‌కి చాలా దగ్గరగా ఉండి కథ రాసుకుంటాను. నా నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమా కోరుకుంటారు, అసలు నా బలం ఏమిటనేది అనలైజ్ చేసుకుంటాను. ప్రతి సినిమాకి ముందు ఇంతకు ముందు సినిమాలలోని పాత్రలు, వాటి తాలుకూ ప్రభావం పడకుండా జాగ్రత్త పడతాను. అంతే, ఆటోమేటిగ్గా సినిమా ఫ్రెష్‌గా ఉంటుంది. అందుకే ఆడియన్స్ నన్ను ఈవివిగారితో పోల్చుతున్నారేమో. ఈవివిగారు ఓ లెజెండ్. ఆయన సినిమాలు చూసి చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆయనతో పోల్చడం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, బిగ్గెస్ట్ రెస్పాన్స్ బులిటీగా భావిస్తాను.
Also Read: టాలీవుడ్ తాట తీస్తున్న ఐటీ రైడ్స్... అసలు టార్గెట్ దిల్ రాజు కాదా?
ఈ పదేళ్ళలో నాలో ఎలాంటి మార్పు లేదు. ఇంతకు ముందు ప్రతిదానికి రియాక్ట్ అయ్యేవాడిని. ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. వర్క్ పైనే ఫోకస్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రతి శుక్రవారం వచ్చే సినిమాలు చూస్తాను. అందులో నేర్చుకోవాల్సిన విషయాలు వుంటే నేర్చుకుంటాను. ఇది ఈ పదేళ్ళుగా చేస్తున్నాను. ‘పటాస్’కు ముందే ఏడాదిన్నర జర్నీ వెనక్కి వెళ్లి చూసుకుంటే స్ఫూర్తిదాయకంగా వుంటుంది. చాలా ఎమోషనల్ జర్నీ. చాలా ఓపికగా ప్రయత్నం చేశాను. నాకున్న లిమిటేషన్‌తో చాలా కాంపాక్ట్ బడ్జెట్‌తో ‘పటాస్’ చేశాం. అది ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. డెబ్యునే అందరూ మాట్లాడుకునేలా చేసి సినిమా సినిమాకి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ప్రతి సినిమాకి ప్రూవ్ చేసుకోవడం నిజంగా నాకే ఒక ఇన్స్పిరేషన్‌గా అనిపిస్తుంది.
సినిమాలోని బుల్లి రాజు పాత్రకు స్ఫూర్తి ఉంది. జంధ్యాలగారి సినిమాలు నాకు చాలా ఇష్టం. ‘హైహై నాయక’లో ఒక సౌండ్ ఎఫెక్ట్‌తో అది వస్తుంది. ఇప్పుడు ఓటీటీ నేపధ్యంలో బుల్లిరాజు పాత్రని డిజైన్ చేశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ మీట్‌లో దిల్ రాజుగారు, శిరీష్ గారు మమ్మల్ని నిలబెట్టామని అన్నారు. నిజంగా నిలబెట్టింది నేను కాదు. ఆడియన్స్. ఈ క్రెడిట్ అంతా ఆడియన్స్‌కే చెందుతుంది. దిల్ రాజుగారు ఎన్నో అద్భుతమైన సక్సెస్‌లు ఇచ్చారు. ఈ విజయంతో ఆడియన్స్ వారిని నిలబెట్టారు. బళ్ళు కట్టుకొని మరీ వచ్చి ఈ సినిమాను చూశారు. ఈ సినిమా విజయం ఓ వండర్. ఓ కేస్ స్టడీ. ఈ సినిమా ఎందుకు ఇంతపెద్ద హిట్ అయ్యిందో నేను కేస్ స్టడీగా పెట్టుకోవాలి. ప్రస్తుతానికైతే మేమంతా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాం.
నెక్ట్స్ చిరంజీవిగారితో చేయబోయే సినిమా గురించి ఇప్పుడే మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. ఎలాంటి జోనర్‌లో చేయాలనే టాక్స్, హోమ్ వర్క్ జరుగుతుంది. వందశాతం అందరూ ఊహించినదానికంటే ఎక్కువగా చిరంజీవిగారిని ప్రజెంట్ చేయాలనే విల్ పవర్‌తో వున్నాను. చిరు, బాలయ్య, వెంకీ.. తర్వాత నాగార్జునగారితో కూడా సినిమా చేసి.. ఫోర్ పిల్లర్స్‌తో సినిమాలు చేశాననే రికార్డ్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నాగార్జునగారితో చేస్తే మాత్రం ‘హలోబ్రదర్’ తరహా చిత్రం చేయాలని ఉంది. ఈ పదేళ్లుగా నా సక్సెస్‌లో భాగమైన మీడియాకు కూడా ధన్యవాదాలు’’ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.