Just In





Tollywood IT Raids: టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
TollyWood: టాలీవుడ్‌లో బడా నిర్మాతలపై దాడులు పక్కా సమాచారంతోనే జరుగుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. టాలీవుడ్ కు ఆర్థికంగా ఉండే ఫైనాన్షియర్లపైనా ఐటీ గురి పెట్టడం ఇదే మొదటి సారి.

Attacks on big producers in Tollywood are being done with proper information: టాలీవుడ్‌లో జరుగుతున్న ఐటీ దాడులు తన ఒక్కరిపై కాదని మొత్తం ఇండస్ట్రీపై జరుగుతున్నాయని దిల్ రాజు ప్రకటించారు. అయితే ఆయన ఆలా చెప్పారు కానీ.. పూర్తి స్థాయిలో వందల కోట్లతో సినిమాలు తీస్తున్న, కలెక్షన్లు సాధించిన వారిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇంకా చెప్పాలంటే వారికి ఫైనాన్స్ చేస్తున్న వారిని కూడా వదిలి పెట్టలేదు. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాతనే రంగంలోకి దిగారని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇండస్ట్రీ నుంచే సమాచారం వెళ్లిందా ?
సినిమాల్లో చూపించినట్లుగా ఒక్క సారిగా జరిగిన ఈ రెయిడ్స్ తో అగ్రనిర్మాతలకు మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. ఎందుకటే పెద్దగా బయటకు కనిపించని ఫైనాన్షియర్లపై కూడా రెయిడ్ చేశారు. వారి ఆర్థిక లావాదేవీల్వీ వెలికి తీస్తున్నారు. అలాగే సినిమాలను ఏరియాల వారీగా అమ్మినప్పుడు వచ్చే నగదును ఎలా సర్క్యూలేషన్ లోకి తెస్తారో కూడా ఆరా తీస్తున్నారు. మొత్తంగా అసలు టాలీవుడ్‌లో బడా నిర్మాతల ఆర్థిక వ్యవహారాలపై పూర్తి సమాచారం ఐటీ అధికారులకు ఇండస్ట్రీ నుంచే వెళ్లిందని ఆ మేరకు స్కెచ్ వేసుకుని మరీ రంగంలోకి దిగారని అంటున్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీ డబ్బు గోడొన్ల్నీ టార్గెట్ లోనే !
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ నిర్మాతలు ఇప్పుడు అంత దూకుడుగా సినిమాలు తీయడం లేదు. సురేష్ ప్రొడక్షన్స్ చాలా పరిమితంగా సినిమాలు చేస్తోంది. గీతా ఆర్ట్స్ చాలా సెలక్టివ్ గా ఉంటోంది. ఇతర నిర్మాతలు మాత్రం చాలా దూకుడగా ఉంటున్నారు. వీరందరికీ ఇండస్ట్రీలో డబ్బు గోడౌన్లుగా ప్రసిద్ధి చెందిన కొంత మంది ఫైనాన్షియర్లు అండగా ఉంటున్నారు. రాజకీయ నేతల సొమ్ములకు వీరు బినామీలుగా ఉండి.. సినీ ఇండస్ట్రీలోకి పంప్ చేస్తారని భావిస్తున్నారు. ఇలాంటి డబ్బు గోడౌన్ల గురించి పూర్తి సమాచారంతో ఐటీ అధికారులు దాడులు చేసినట్లుగా అనుమానిస్తున్నారు.
ఎన్ని రోజులు సోదాలు ?
సినీ ప్రముఖులపై ఐటీ దాడులు సహజంగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ జరిగే వాటికి ఇప్పుడు జరుగుతున్న వాటికి చాలా తేడా ఉంది. గతంలో ఎవరో ఒకరిపై దాడులు చేసి సోదాలు చేసి వెళ్లిపోయేవారు. కానీ ఆ సారి మొత్తం లావాదేవీల గుట్టు బయటకు లాగేందుకు చాలా పెద్ద ప్రణాళికతో వందల మంది వచ్చి సోదాలు చేస్తున్నారు. అంత తేలికగా ఈ వ్యవహారం సమసిపోదని.. మొత్తం టాలీవుడ్ ఆర్థిక మూలాలను గట్టిగా పట్టుకుంటారని అంటున్నారు. అందుకే టాలీవుడ్ లో ఈ ఐటీ దాడులు సంచలనంగా మారాయి.
Also Read: త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?