Mahakumbh fame Monalisa offered Diary Of Manipur: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మోనాలిసా పేరే మార్మోగిపోతోంది. ఆమె ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ బ్యూటీకి ఊహించని జాక్ పాట్ తగిలినట్టు తెలుస్తోంది. రోడ్డుపై రుద్రాక్ష దండలు అమ్ముకుంటున్న మోనాలిసాకు ఏకంగా బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ వరించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మోనాలిసా ఎవరు ?
కొంతమందికి అదృష్టం అడగకుండానే తలుపు తడుతుంది. ఇంతకుముందు రైల్వే స్టేషన్లో పాట పాడుకుంటున్న రేణు మండల్ ను ఇలాగే అదృష్టం వరించింది. ఆమెకు ఏకంగా బాలీవుడ్లో పాటలు పాడే అద్భుతమైన అవకాశం దక్కింది. రేణూ పాట పడితే ఏకంగా లతా మంగేష్కర్ పాడినట్టే ఉంటుందని ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా ఇలాగే మోనాలిసా లైఫ్ కూడా మహా కుంభమేళా కారణంగా టర్న్ తిరిగింది. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ రుద్రాక్ష దండలు అమ్ముకుంటోంది ఈ అమ్మడు.
ఈ నేపథ్యంలోనే ఓ ఇన్ఫ్లూయెన్సర్ కెమెరాకు చిక్కింది మొనాలిసా. అందంగా, అమాయకత్వం ఉట్టి పడుతున్న ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చూడగానే తేనె కళ్ళతో మత్తెక్కించే ఈ నేచురల్ బ్యూటీ అందానికి నెటిజెన్లు ఫిదా అయిపోయారు. ఆమె అందంగా నవ్వుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడంతో క్షణంలో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది మోనాలిసా. నెటిజన్ల పుణ్యమా అని ఓవర్ నైట్ స్టార్ గా మారిన మోనాలిసాని చూడడానికి కుంభమేళాకు వెళ్లిన భక్తులంతా ఎగబడుతున్నారు. చాలామంది ఆమెతో ఫోటోలు, వీడియోలు దిగడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. కానీ అలా వస్తున్న జనాల వల్ల మోనాలిసా తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. రీసెంట్ గా ఆమెను చూడడానికి వచ్చిన జనాల నుంచి కాపాడుకోవడానికి మోనాలిసా కుటుంబ సభ్యులు ప్రయత్నించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేసింది.
బీ టౌన్ డైరెక్టర్ బంపర్ ఆఫర్
ఈ నేపథ్యంలోనే తాజాగా తేనె కళ్ళ సుందరి మోనాలిసాకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ ప్రస్తుతం 'డైరీ ఆఫ్ మణిపూర్' మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఆయన ఈ సినిమాలో ఓ పాత్రకి మోనాలిసా బాగా సెట్ అవుతుందని అనుకున్నారట. తన సినిమాలో రైతు కూతురు పాత్రకు మోనాలిసా అద్భుతంగా ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఆ పోస్టులో "మోనాలిసా అమాయకపపు లుక్ కు నేను ఫిదా అయ్యాను. నేను ఆమెకు నా మూవీ 'డైరీ ఆఫ్ మణిపూర్'లో అవకాశం ఇస్తున్నాను" అంటూ ప్రకటించారు. ఆమెకు యాక్టింగ్ తెలియదు కాబట్టి, నేర్పించి మరీ ఈ సినిమాలో అవకాశం ఇవ్వబోతున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే మోనాలిసాకి కేవలం బాలీవుడ్ లోనే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాలో కూడా అవకాశం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు.
Also Read: 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... రామ్ చరణ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా?