Anil Ravipudi: హీరోగా అనిల్ రావిపూడి... ప్రొడ్యూసర్ ఫిక్స్, అగ్రిమెంట్ కంప్లీటెడ్

Anil Ravipudi Turns Hero: వరుస విజయాలతో దర్శకుడిగా తన ఇమేజ్ పెంచుకుంటూ వెళుతున్న అనిల్ రావిపూడి హీరోగా మారడం అయితే గ్యారెంటీ. హీరోగా అనిల్ మొదటి సినిమాకు నిర్మాత కూడా ఫిక్స్! 

Continues below advertisement

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అపజయం అంటూ ఎరుగని దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అనిల్ రావిపూడి పేరు చెప్పాలి. ఆయనకు రీజినల్ రాజమౌళి అని మీడియాలో కొంతమంది బిరుదు కూడా ఇచ్చేశారు. దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకు వెళుతున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi)లో నటుడు కూడా ఉన్నాడు. మరి అతను హీరోగా ఎప్పుడు తెర మీదకు వస్తాడు? అంటే...

Continues below advertisement

హీరోగా అనిల్ రావిపూడి... నిర్మాత ఎవరంటే!?
అనిల్ రావిపూడికి నటన మీద ఆసక్తి ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలను ప్రమోట్ చేయడానికి ఆయన చేసే స్కిట్స్ లేదా ఇంటర్వ్యూస్ చూస్తే ఆ విషయం తెలుస్తుంది.‌‌ ఆయన అందగాడు కూడా! మరి, అనిల్ రావిపూడి హీరోగా మారతారా? మెగా ఫోన్ పక్కన పెట్టి యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తారా? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. 

దర్శకుడుగా ఇప్పుడు తాను మంచి స్థాయిలో ఉన్నానని, తన సినిమాలు సరిగా ఆడని సమయంలో నటన వైపు వస్తానని అనిల్ రావిపూడి సన్నిహితులతో చెప్పినట్లు ఇండస్ట్రీ గుసగుస. ఒకవేళ అనిల్ రావిపూడి హీరోగా మారితే? ఆ సినిమా ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? వంటి ప్రశ్నలు అవసరం లేదు. ఆల్రెడీ నిర్మాత రెడీగా ఉన్నారు. 

వెండితెరకు అనిల్ రావిపూడిని హీరోగా పరిచయం చేసేది మరెవరో కాదు... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, ‌ అగ్ర నిర్మాత 'దిల్' రాజు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విజయం సాధించిన సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లు అందరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అక్కడ అనిల్ రావిపూడి యాక్టింగ్ డిబ్యూ గురించి ప్రశ్న వచ్చింది.

''అనిల్ రావిపూడి ఎటువంటి యాక్టర్ అవుతాడు అనేది ఇప్పుడే తెలియదు. కానీ తప్పకుండా అనిల్ యాక్టర్ అవుతాడు. అతడి లాంచింగ్ సినిమా మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలోనే ఉంటుంది. ఆల్రెడీ అగ్రిమెంట్ అయ్యింది. అనిల్ యాక్టింగ్ చేస్తే అది మా ఎస్ వి సి సంస్థలోనే'' అని దిల్ రాజు చెప్పారు.

Also Read'గేమ్ చేంజర్' తీగ లాగితే... 'దేవర', 'పుష్ప 2' గుట్టు బయటకు వచ్చిందా? ఆ రెండు సినిమాలకూ లాభాలు రాలేదా?

అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమైన 'పటాస్', నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తీసిన 'భగవంత్ కేసరి' మినహా మిగతా సినిమాలు అన్నిటిని 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేశారు. అనిల్ రావిపూడి కి తమకి మధ్య మంచి అనుబంధం ఉందని, అనిల్ ఏది కావాలంటే అది తన ఇంటికి వెళుతుందని అంతే తప్ప గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం షో ఆఫ్ చేయడం వంటివి తమ దగ్గర ఉండవని 'దిల్' రాజు తెలిపారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నారు. ఆ తర్వాత ఎవరితో ఉంటుంది? అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ, అతనితో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. 

Also Readఅల్లు అర్జున్ వస్తున్నాడు... కండిషన్స్ అప్లై... చైతూ టీమ్ అలా చేయక తప్పదు మరి!

Continues below advertisement