సుమ - రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల హీరోగా 'బబుల్ గమ్' అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేయగా మంగళవారం (అక్టోబర్ 10) రోజున మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న ఫస్ట్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ని సుమ హోస్ట్ చేయడం విశేషం. నాని 'బబుల్ గమ్' టీజర్ ను విడుదల చేసి మూవీ టీం కి తన బెస్ట్ విషెస్ అందజేశారు. అయితే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో సుమా, రాజీవ్ ల కొడుకు రోషన్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.
మొదటి సినిమా అని ఎక్కడా తడబడకుండా నటించడంతోపాటు వేదికపై చాలా బాగా మాట్లాడాడు. ఈవెంట్ లో భాగంగా సుమ తన కొడుకు దగ్గరికి వెళ్లి, 'రోషన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామని మైక్ ఇస్తుంటే.. దానికి రోషన్ బదులిస్తూ..' థాంక్యూ సుమ గారు మా ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్నందుకు' అంటూ తన తల్లిని ఆటపట్టించాడు. ఆ తర్వాత మాట్లాడుతూ.. "ఈ ఈవెంట్ కి వచ్చి నా మూవీ టీజర్ రిలీజ్ చేసిన నాని అన్నకి థాంక్యూ సో మచ్. మాలాంటి యంగ్ స్టార్స్ కి మీరు కూడా ఓ ఇన్స్పిరేషన్. ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎస్.ఎస్ రాజమౌళి గారు చేసే ప్రతి సినిమా నాపై ఎంతో ఇంపాక్ట్ ని చూపించింది. ఆయన సినిమాలతో ఇంకా నేర్చుకోవాలనే తపన నాలో మొదలైంది. ఆయన మా మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం అనేది ఓ డ్రీమ్. రాజమౌళి సార్ కి థాంక్యూ సో మచ్. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నా" అని అన్నాడు.
"ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ గారు మొదటి నుంచి మా సినిమాను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మా డైరెక్టర్ రవికాంత్ గురించి చెప్పాలంటే మీరు టీజర్ లో చూశారు కదా. అవన్నీ రవికాంత్ దగ్గరుండి మరి నాతో చేయించారు. నన్ను నమ్మి నాతో ఈ సినిమా చేసిన మా డైరెక్టర్ రవికాంత్ కి థాంక్యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల జనరల్ గా మ్యూజిక్ అదరగొట్టేస్తారు. ఇక మా సినిమాలో దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. హీరోయిన్ మానస చాలా మంచి కోస్టార్. రేపు మూవీ రిలీజ్ అయ్యాక మీరంతా చూస్తారు. జాన్వి క్యారెక్టర్ తో మీరంతా ప్రేమలో పడతారు. నేను కూడా ఆదిగా జాన్వితో ఫుల్ లవ్ లో పడిపోయా" అని పేర్కొన్నాడు.
"మా అమ్మ, నాన్నకి థాంక్స్. నన్ను నమ్మి నేనేం చేయాలనుకున్నానో చేయనిచ్చినందుకు. నేను హీరోగా లాంచ్ అవ్వడాన్ని మా తాతగారు చూసి వెళ్ళిపోతారేమో అని అనుకున్నా. కానీ ముందే వెళ్లిపోయారు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఉండి నన్ను చూస్తారని నమ్ముతున్నాను. చివరగా ప్రేక్షకదేవులందరికీ థాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే మీరు చూస్తేనే ఈ సినిమాలు నడిచేది, మేము సినిమాలు తీసేది. మా 'బబుల్ గమ్' సినిమాని కూడా మీరంతా ఆదరిస్తారని కోరుకుంటూ బబుల్ గమ్ మూవీ నుంచి ఒక డైలాగ్ తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా.." నా నసీబ్ లో ఏం రాసి పెట్టిందో నాకు తెలవదు. కానీ దాన్ని నాకు నచ్చినట్టు మార్చుకుంటా. కావలసింది లాక్కొని తెచ్చుకుంటా. అది ఇజ్జత్ అయినా అవుకాత్ అయినా" అనే డైలాగ్ తో రోషన్ తన తన ప్రసంగాన్ని ముగించాడు.
Also Read : ఘాటు ముద్దులతో రెచ్చిపోయిన యాంకర్ సుమా కొడుకు - ‘బబుల్ గమ్’ అంటే అర్థం ఇదా? టీజర్ చూశారా?