అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) అభిమానులకు గుడ్ న్యూస్. అతి త్వరలో వెండి తెరపై ఆవిడ స్పెషల్ సాంగ్‌తో సందడి చేయనున్నారు. ఇంతకు ముందు సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' సినిమాలో 'సూయ... సూయ... సూయ... అనసూయ' పాటలో ఆవిడ సందడి చేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 2 : ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్', కార్తికేయ గుమ్మకొండ 'చావు కబురు చల్లగా' సినిమాల్లో కూడా అనసూయ స్పెషల్ సాంగ్స్ చేశారు. కానీ, లేటెస్ట్ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే... దీనికి దర్శ కేంద్రులు రాఘవేంద్రరావు టచ్ ఉండటం!
'వాంటెడ్ పండుగాడ్'లో...
దర్శ కేంద్రులు కె. రాఘవేంద్రరావు సమర్పణలో శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న సినిమా 'వాంటెడ్ పండుగాడ్' (Wanted Pandugadu Movie). యునైటెడ్ కె ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది. సాయి బాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మాతలు. ఈ చిత్రంలో అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆవిడపై తెరకెక్కించిన 'కేక కేక' సాంగ్ (Anasuya Keka Keka Song) ఈ రోజు విడుదల చేశారు. సంగీత దర్శకుడు పీఆర్ బాణీతో పాటు సాహిత్యం అందించిన ఈ గీతాన్ని ఉమా నేహా ఆలపించారు.
Anasuya Keka Keka Song Lyrics In Telugu : 'కేక కేక' సాంగ్ లిరికల్ చూస్తే... కె. రాఘవేంద్రరావు మార్క్ టచ్ ఇస్తూ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అనసూయ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి సాంగ్ కోసం వేసిన సెట్స్, ఆ ట్యూన్... రాఘవేంద్రుడి శైలిని గుర్తు చేస్తున్నాయి. హీరోలు కమ్ కమెడియన్స్ సప్తగిరి, శ్రీనివాస రెడ్డి ఈ పాటలో అనసూయతో పాటు సందడి చేశారు. ఈ సాంగ్ లిరిక్స్ చూస్తే...
కేక పెట్టి గోల చేసే కోక
కాక పెట్టి గిల్లి చూసే రైక...
ఆడి చూసి పాడి చూసి తికమక మకతిక
పైకి చూసి తాకి చూసే జనమిక జరగక
తద్దినక తద్దినక ఆగను ఇంకా!
తద్దినక తద్దినక వద్దనలేక!
'సుడిగాలి' సుధీర్, దీపికా పిల్లిపై ఒక పాట!
'వాంటెడ్ పండుగాడ్' సినిమాలో 'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer), దీపికా పిల్లిపై ఒక పాట తెరకెక్కించారు. యాంకర్ విష్ణుప్రియపై మరో పాట చిత్రీకరించారు. ఆ రెండు పాటలను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఇప్పుడు మూడో పాట, అనసూయపై తెరకెక్కించిన 'కేక కేక' విడుదల చేశారు. సినిమాలో మూడు పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. అనసూయ సాంగ్ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. సినిమాకు అనసూయ సాంగ్ క్రేజ్ తీసుకు వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read : రవితేజ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు
సునీల్, 'వెన్నెల' కిషోర్, నిత్యా శెట్టి, బ్రహ్మానందం, రఘుబాబు, అనంత్, 'పుష్ప' జగదీశ్, హేమ, 'షకలక' శంకర్ తదితరులు నటించిన ఈ సినిమాను ఆగస్టు 19న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే