Rangammatta vs Sumathi : రంగమ్మత్తను మర్చిపోయేలా సుమతి క్యారెక్టర్ - అనసూయ మామూలుగా ఏడిపించదు!

తెలుగు సినిమా ప్రేక్షకులకు అనసూయ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రామ్ చరణ్ 'రంగస్థలం'లోని రంగమ్మత్త క్యారెక్టర్! అయితే... 'విమానం'లో సుమతి పాత్ర రంగమ్మత్తను మర్చిపోయేలా చేస్తుందని తెలిసింది.

Continues below advertisement

తెలుగు బుల్లితెర అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)లో గ్లామర్ మాత్రమే చూసింది. టీవీ షోలకు యాంకరింగ్ చేసినప్పుడు ఆమె గ్లామర్, డ్రసింగ్ స్టైల్ గురించి ఎక్కువ డిస్కషన్ నడిచింది. ఆ అనసూయలో నటిని వెండితెర వెలుగులోకి తీసుకు వచ్చింది. టీవీలో కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ, మెల్లగా సినిమాల్లోకి వచ్చారు. 

Continues below advertisement

స్టార్ యాంకర్ అయిన తర్వాత అనసూయ నటించిన తొలి సినిమా 'సోగ్గాడే చిన్ని నాయనా'. అందులోనూ గ్లామర్ గాళ్ రోల్ చేశారు. అయితే... ఆ తర్వాత అడివి శేష్ 'క్షణం'లో ఏసీపీ జయ భరద్వాజ్ పాత్రలో నటిగా మెరిశారు. ఇక, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రంగస్థలం' (Rangasthalam Movie)లో అనసూయ చేసిన రంగమ్మత్త (Rangammatta Role) పాత్ర అయితే ఆమెను నటిగా ఎక్కడికో తీసుకు వెళ్ళింది. అనసూయ నటన గురించి అందరూ పొగిడేలా చేసింది. అనసూయ సినిమాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ 'రంగమ్మత్త' ప్రస్తావన వస్తుంది. అయితే... కొత్త సినిమా 'విమానం'లో అనసూయ నటన రంగమ్మత్తను మరిచిపోయేలా చేస్తుందని టాక్. 

సుమతి మామూలుగా ఏడిపించలేదు!
'విమానం'లో (Vimanam 2023 Movie) సుమతి పాత్రలో అనసూయ నటించారు. బస్తీలోని ఆమెకు లైన్ వేసే యువకుడిగా నటుడు రాహుల్ రామకృష్ణ కనిపిస్తారు. ఆ సినిమాలో వాళ్లిద్దరూ ఓ జంట అన్నమాట! సుమతి మీద తన ప్రేమను తెలియజేస్తూ రాహుల్ రామకృష్ణ పాడుకునే పాటను తాజాగా విడుదల చేశారు. జూన్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ చిత్రీకరణ అంతా పూర్తి అయ్యింది. రషెష్ చూసిన వ్యక్తులు చెప్పేదాని ప్రకారం... అనసూయ క్యారెక్టర్ రంగమ్మత్తను మర్చిపోయేలా చేస్తుందట!

'విమానం'లో అనసూయ, రాహుల్ రామకృష్ణ మధ్య సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని తెలిసింది. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఓ పది నిమిషాల పాటు సాగే ఎమోషనల్ సీన్ ఒకటి ఉందని... అందులో అనసూయ నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుందని తెలిసింది. అనసూయ యాక్టింగ్ చూసి ఏడుపు రాని ప్రేక్షకుడు ఉండరని యూనిట్ సన్నహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆల్రెడీ రిలీజైన పాటలో అనసూయ గ్లామర్, అదే సమయంలో ఆమెపై రాహుల్ రామకృష్ణ పాత్రకు ఉన్న ప్రేమను చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ఎమోషన్ దాచేశారు. అదీ సంగతి! 

Also Read : కన్నడ దర్శకుడితో బాలకృష్ణ పాన్ ఇండియా మల్టీస్టారర్!?

'విమానం' తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల అవుతోంది. సందీప్ కిషన్ 'మైఖేల్' ద్వారా తమిళ తెరకు అనసూయ పరిచయం అయ్యారు. అందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ భార్య పాత్ర చేశారు. వరుణ్ సందేశ్ తల్లిగా కనిపించారు. అయితే, తమిళంలో అనసూయకు 'విమానం' మరింత గుర్తింపు తీసుకు వస్తుందని టాక్. 

'విమానం'లో సముద్రఖని, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, ధ‌న్‌రాజ్‌, మీరా జాస్మిన్, తమిళ నటుడు మొట్ట రాజేంద్ర‌న్ ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాతో మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ సంస్థలు నిర్మించిన చిత్రమిది. దీనికి శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రానికి కళ :  జె.జె. మూర్తి, కూర్పు :  మార్తాండ్ కె. వెంక‌టేష్‌, మాటలు : హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం), పాటలు : స్నేహ‌న్‌ (తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు), ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, సంగీతం : చ‌ర‌ణ్ అర్జున్‌.

Also Read : ఆ ట్వీట్స్ మీనింగ్ ఏంటి 'డింపుల్' మేడమ్? పోలీసులదే తప్పు అంటారా?

Continues below advertisement