Anasuya Bharadwaj : స్ట్రాంగ్‌గా ఉండాలనుకున్నా కానీ - వెక్కివెక్కి ఏడ్చిన అనసూయ

స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ వెక్కి వెక్కి ఏడ్చారు. సోషల్ మీడియాలో ఆమె భారీ పోస్ట్ ఒకటి చేశారు.

Continues below advertisement

రంగుల ప్రపంచంలో మహిళలపై విమర్శలు చేసే వ్యక్తులు సమాజంలో ఉన్నారు. ఆ విమర్శలను స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) సైతం ఎదుర్కొన్నారు. అయితే... విమర్శలకు ధీటుగా బదులు ఇవ్వడం ఆమె స్టైల్. అటువంటి అనసూయ కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనమైంది. 

Continues below advertisement

'ఫైర్ బ్రాండ్' పదానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు కనిపించే అనసూయ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో స్వయంగా ఆమె పోస్ట్ చేశారు. దాంతో పాటు నెటిజనులకు భారీ లేఖ కూడా రాశారు.

ప్రస్తుతం బావున్నా... ఐదు రోజుల క్రితం!
అనసూయ ఓ క్లారిటీ ఇచ్చారు. తాను కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఐదు రోజుల క్రితం తీసుకున్న వీడియో అని చెప్పారు. ప్రస్తుతం తాను బావున్నానని తెలిపారు. అయితే... జీవితంలో ఓ దశను గుర్తు పెట్టుకోవడం కోసం, జ్ఞాపకంగా ఉంచుకోవడం కోసం వీడియో రికార్డ్ చేశానని పేర్కొన్నారు. అసలు, ఆమెను అంతగా బాధ పెట్టిన విషయం ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల తాను మానసిక క్షోభకు గురి అవుతున్నట్లు తెలిపారు. 

సోషల్ మీడియా ఉద్దేశం ఏమిటి?
ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి?
తాను కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో / పోస్ట్ చూసిన ప్రజలు అందరూ కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటారని తనకు తెలుసునని పేర్కొన్న అనసూయ... ''నాకు తెలిసినంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఒకరితో ఒకరు టచ్ లో ఉండటం కోసం సోషల్ మీడియా తీసుకు వచ్చారు. సంస్కృతి, సంప్రదాయాలు, సంతోషాలు, సమాచారం, జీవన విధానాలు... ఒకరితో ఒకరు పంచుకోవడం కోసం సామాజిక మాధ్యమాలను ప్రజల ముందుకు తీసుకు వచ్చారు. అది వాటి ఉద్దేశం. ఇవాళ సోషల్ మీడియాలో అటువంటిది ఉందా?'' అని ప్రశ్నించారు. 

ఫోటోషూట్లు, డ్యాన్సులు, నవ్వులు, స్ట్రాంగ్ కౌంటర్లు, వగైరా వగైరా తన జీవితంలో ఓ భాగం అని అనసూయ తెలిపారు. అవన్నీ నెటిజనులతో పంచుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. జీవితంలో తాను బలహీనంగా ఉన్న క్షణాలు, మానసికంగా ధృడంగా లేని సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు ఉన్నాయన్నారు. సెలబ్రిటీ (పబ్లిక్ ఫిగర్)లకు ఇవన్నీ తప్పవని ప్రజలు తెలుసుకోవాలని అనసూయ వ్యాఖ్యానించారు. 

బలంగా ఉండాలని అనుకున్నా...
సోషల్ మీడియాలో కొందరు చేసే కామెంట్స్, ట్రోల్స్ తనపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నట్లు అనసూయ భరద్వాజ్ తెలిపారు. ''బలంగా ఉండాలని, డోంట్ కేర్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్లాలని, న్యూట్రల్ ఫీలింగ్స్ తో ఉండాలని ఎంత ఆలోచించినా... అలా ఉండలేకపోతున్నాను. పైకి బలంగా కనిపిస్తున్నా... నా బలం అది కాదు. నా ఫీలింగ్స్ బయట పెట్టి... మంచిగా ఏడ్చి... రెండు మూడు రోజుల తర్వాత చిరునవ్వుతో ప్రపంచాన్ని ఎదుర్కోవడం... ఇది నా అసలైన బలం'' అని అనసూయ తెలిపారు.

Also Read : అత్తారింట అల్లు అర్జున్‌కు గ్రాండ్ వెల్కమ్ - మామగారి ఫంక్షన్ హాల్ ఓపెనింగ్‌లో...

విశ్రాంతి తీసుకుని, మళ్ళీ బలం పుంజుకుని ముందు వెళ్లడం ముఖ్యమని అనసూయ సందేశం ఇచ్చారు. ఎదుటి వ్యక్తుల మీద ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా... ఏం విసిరినా... వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని, అందుకని అందరి పట్ల మంచిగా ఉండాలని అనసూయ హితవు పలికారు. ప్రస్తుతం తాను అది బలంగా తెలుసుకుంటున్నాని చెప్పారు. అదీ సంగతి!

Also Read 'భగవంత్ కేసరి' ప్రీ రిలీజ్ బిజినెస్ - బాలకృష్ణ ముందున్న టార్గెట్ ఎంతంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement