అందాల తార సమంత అమెరికాకు బయల్దేరి వెళ్లింది. న్యూయార్క్ కు వెళ్తూ ఎయిర్ పోర్టులో కనిపించింది. తన తల్లితో కలిసి అమెరికాకు వెళ్లింది. ఈ సందర్భంగా అభిమానులకు సెల్ఫీలు కూడా ఇచ్చింది. గత కొంత కాలంగా మైయోసిటిస్ బాధ పడుతున్న ఆమె అమెరికాలో పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోనుంది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాతే ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   


సినిమాలకు విరామం ప్రకటించిన సమంత


సమంత ‘యశోద’ సినిమా చేస్తున్న సమయంలోనే ఆమెకు మైయోసైటిస్‌ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకుని మళ్లీ షూటింగ్ కంప్లీట్ చేసింది. పూర్తి స్థాయిలో వ్యాధి నయం కాకపోయినా, తన వర్క్ కమిట్ మెంట్స్ చాలా వరకు పూర్తి చేసింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ షూటింగ్‌ను పూర్తి చేసింది. వరుణ్ ధావన్‌తో ‘సిటాడెల్’ వెస్ సిరీస్ ను కూడా కంప్లీట్ చేసింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో చాలా ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. కొంత మంది నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్సులను కూడా తిరిగి చెల్లించింది. తన ఆరోగ్యం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మైయోసైటిస్‌ పూర్తి స్థాయిలో నయం అయ్యేంత వరకు సినిమాలకు విరామం ప్రకటించింది.


ఆధ్యాత్మిక యాత్రతో వెకేషన్  ప్రారంభించిన సామ్


సినిమాలకు బ్రేక్ చెప్పిన తర్వాత  సమంత ఆధ్యాత్మిక యాత్రతో వెకేషన్  ప్రారంభించింది.  తమిళనాడు రాయవేలూరులోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించింది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం ఆ యాత్రకు సంబధించిన రోడ్ ట్రిప్ ఫోటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ తర్వాత బాలి వెకేషన్ కు వెళ్లింది. అక్కడ తన మేకప్ ఆర్టిస్ట్ అనూషతో కలిసి ఈస్ట్ ఏషియన్ కంట్రీలో సరదగా గడిపింది.   కొద్ది రోజులు వీరిద్దరు అక్కడే న్నారు.  సమంత బాలి బీచుల్లో విశ్రాంతి తీసుకోవడంతో పాటు స్థానిక వంటకాలను హాయిగా ఆస్వాదించింది. ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆనందంగా గడిపింది. బాలి వెకేషన్ లో తన ఆరోగ్య సమస్యలను మర్చిపోయి ఆహ్లాదంగా గడిపే ప్రయత్నం చేసింది.    


ఆశలన్నీ‘ఖుషీ’ పైనే!


సమంత ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ‘ఫ్యామిలీ మెన్’  వెబ్ సిరీస్ తో   దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ పైనా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం సమంతకు ఈ ఏడాది అంతగా కలసి రాలేదు. సమంత చివరిగా ‘శాకుంతలం’ సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. త్వరలో విడుదల కానున్న ‘ఖుషీ’ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది సమంత. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.  శివ నిర్వాణ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన  ‘ఖుషీ’  మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ జోష్ ఫుల్ గా జరిగింది.  






Read Also: రజనీ సినిమాలో బిగ్ బీ - 3 దశాబ్దాల తర్వాత మళ్లీ కలుస్తున్న లెజెండరీ యాక్టర్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial