Allu Arjun : అత్తారింట అల్లు అర్జున్‌కు గ్రాండ్ వెల్కమ్ - మామగారి ఫంక్షన్ హాల్ ఓపెనింగ్‌లో...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ నల్గొండలో సందడి చేశారు. ఆయనకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.

Continues below advertisement

'తగ్గేదే లే' - 'పుష్ప' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చెప్పిన డైలాగ్ ఇది. ఇవాళ నల్గొండలో ఆయన్ను చూడటానికి వచ్చిన ప్రజలను చూస్తే... 'పబ్లిక్ లో ఆయన క్రేజ్ తగ్గేదే లే' అని చెప్పాలేమో!? ఆ స్థాయిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అసలు వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

అల్లు అర్జున్ చేతుల మీదుగా...
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్వస్థలం నల్గొండ. బన్నీ మామ, స్నేహ తండ్రి కంచర్ల చంద్రశేఖర్ ఒక ఫంక్షన్ హాల్ కట్టారు. ఆ హాల్ ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలంలోని బట్టు గూడెం  వెళ్లారు బన్నీ. ఆయనకు అక్కడి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. పూల మాలలతో వెల్కమ్ చెప్పారు. అదీ సంగతి! ఇక సినిమాలకు వస్తే... ఇప్పుడు అల్లు అర్జున్ 'పుష్ప 2' చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫస్ట్ లుక్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.

Also Read : 'భగవంత్ కేసరి' ప్రీ రిలీజ్ బిజినెస్ - బాలకృష్ణ ముందున్న టార్గెట్ ఎంతంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ లైక్స్!
తిరుపతి, ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే సంప్రదాయం ప్రకారం గంగమ్మ జాతరలో మహిళల తరహాలో పురుషులు ముస్తాబు కావడం ఆనవాయితీ. చిత్తూరు నేపథ్యంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' తెరకెక్కింది. 'పుష్ప 2'లో ఆ గంగమ్మ జాతర నేపథ్యంలో సన్నివేశాలు ఉన్నాయి. ఆ జాతరలో ఆడ వేషం వేసిన అల్లు అర్జున్ ఆహార్యాన్ని ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్టర్ ఆయన పోస్ట్ చేశారు. దానికి 7 మిలియన్ లైక్స్ వచ్చాయి. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇండియన్ మూవీ పోస్టర్ అన్ని లైక్స్ అందుకోవడం ఇదే తొలిసారి. అల్లు అర్జున్ పోస్టర్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read మాస్ స్టెప్పులతో ఇరగదీసిన రామ్, శ్రీలీల - 'స్కంద'లో ఫస్ట్ సాంగ్ చూశారా?

2024 వేసవిలో 'పుష్ప 2' విడుదల డౌటే!
Pushpa 2 Release Date : తొలుత 2024 సమ్మర్ సీజన్ టార్గెట్ చేస్తూ 'పుష్ప 2'ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ప్రస్తుతం జరుగుతున్న చిత్రీకరణ స్పీడ్ చూస్తే... వేసవికి సినిమా రావడం కష్టం అని వినపడుతోంది. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణ మాత్రమే పూర్తి అయ్యిందని గుసగుస. ముందుగా అనుకున్న విధంగా కాకుండా కథలో సుకుమార్ కాస్త మార్పులు, చేర్పులు చేశారట. యాక్షన్ డోస్ పెంచారట. త్వరలో థాయ్‌లాండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని సమాచారం. షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ & సుకుమార్ విడుదలపై ఓ నిర్ణయం తీసుకుంటారట. ఇటీవల జరిగిన 'ఖుషి' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో వచ్చే ఏడాది 'పుష్ప 2' విడుదల అవుతుందని నిర్మాత నవీన్ ఎర్నేని చెప్పారు. అయితే... ఎప్పుడు విడుదల చేస్తామనేది చెప్పలేదు.  

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement